కీలక స్థానాల్లో ఉన్నపుడు నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటకు వెయిట్ ఉండాలి. ఒక పద్ధతి ఉండాలి. లేకపోతే ఎంత పోటుగాళ్లయినా బొక్కబోర్లా పడక తప్పదు.
హుజూరాబాద్ ఎన్నికల కోసం కేసీఆర్ – జగన్ లోపాయకారిగా సృష్టించుకున్న జలవివాదంలో జగన్ స్పందనతో అందరు విస్తుపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న నీటి లొల్లికి సమర్థంగా సమాధానం చెప్పి నీటిని గెలవాల్సిన జగన్ తెలంగాణలో ఏపీ వాళ్లు నివసిస్తున్నారు కాబట్టి గట్టిగా అడగలేకపోతున్నాం అని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఆ మాట కొస్తే అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని రాష్ట్రాల్లో నివసిస్తారు. ఇదేమైనా సినిమానా హీరోయిన్ కిడ్నాప్ చేస్తే హీరో వచ్చి వినిపించడానికి… జగన్ రాయలసీమ ను కేసీఆర్ తాకట్టుపెట్టకుండా నిలబడి పోరాడితే హైదరాబాదులో ఉన్న ఆంధ్రులకేమీ నష్టం ఉండదు. ఆ మాటకొస్తే తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఆంధ్రుడికి ప్రాంతీయ ఇబ్బుందులనేవి రాలేదు.
అయినా జగన్ ఆ మాటలు మాట్లాడాడు అంటే దానర్థం కేవలం ఇదంతా ఉత్త డ్రామా అని తేల్చడమే. సెంటిమెంట్ మరింత రక్తి కట్టించి ఎన్నికలలో కేసీఆర్ కు మైలేజ్ పెంచే ప్రయత్నం మాత్రమే. అయితే… అదంతా రివర్స్ అయ్యి…పులివెందుల పులి అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడతావేం జగన్ అని జనం ఆశ్చర్యపోతున్నాం.
హైదరాబాదు వస్తే అన్న చెల్లి ఒకే ఇంట్లో ఉంటారు. అదే ఇంట్లో ఉంటూ ఒకరు రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకుంటారట, మరొకరు రాయలసీమలో ప్రాజెక్టు కడతారట. జనం మరీ అంత వెర్రిబాగుల వారిలా కనిపిస్తున్నారా వైఎస్ కుటుంబానికి !
అపుడు ఏపీకి ఎన్నికల ముందు వచ్చి బైబై వాటర్ అని చెప్పిన షర్మిల, ఇపుడు ఏపీకి నీరిచ్చేదే లేదని అంటోందంటే దీనిని అర్థం చేసుకోలేనంత తెలివితక్కువ వాళ్లా తెలుగు ప్రజలు.