మూడో సారి కేసీఆర్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా యజ్జం మొదలుపెట్టిన వైఎస్ షర్మిల పబ్లిసిటీ కోసం చేయని ప్రయత్నమే లేదు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎంట్రీతో తెలంగాణలో రాజకీయే మారిపోయింది. ఇప్పటి వరకు ఒక లెక్క. ఇక్కడి నుంచి ఇక లెక్క అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది. కాంగ్రెస్ లో కకావికలమైన కేడర్ ఒక్కసారిగా కొత్త ఊపుతో ఉరకలేస్తోంది. రేవంత్ ఎక్కడకెళ్లినా కనిపిస్తున్న స్పందనే దీనికి కారణం.
రేవంత్ ను టార్గెట్ చేస్తేనే తనకు ఉనికి అని గమనించిన షర్మిల టి-పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే అతనిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక (మాజీ) టిడిపి నాయకుడు అయిన రేవంత్ రెడ్డిని తన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని కాంగ్రెస్ పార్టీకి ఆమె చురకలు వేశారు.
దీనిపై మీడియా ప్రతినిధులు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దివంగత వైయస్ఆర్ కూడా రెడ్డి కాంగ్రెస్ నుంచి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ లోపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. సీఎం కూడా అయ్యారు.. అని షర్మిల నోటికి తాళం వేశారు రేవంత్ రెడ్డి.
మీ తండ్రి వేరే పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన విషయం మరిచిపోయి మాట్లాడితే మీకే నష్టం అని సరైన కౌంటర్ వేశాడు రేవంత్.
షర్మిల పార్టీని భూస్థాపితం చేసి, కేసీఆర్ నుంచి సీఎం పదవి నుంచి దించగల సమర్థుడు తెలంగాణ మొత్తంపై రేవంత్ ఒక్కడే అని కాంగ్రెస్ గ్రహించడం వల్లే పీసీసీ ఛీఫ్ పదవి రేవంత్ కి కట్టబెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీఆర్ ఎస్ అధికారం నుంచి దిగితేనే కాంగ్రెస్ పార్టీకి ఉనికి అని భావించిన కాంగ్రెస్ పార్టీ… సీనియర్లు పార్టీ వీడినా పర్లేదు రేవంత్ ని సీఎం చేయడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇది సోషల్ మీడియా ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.