బాలీవుడ్ హీరోయిన్ చిక్కుల్లో పడింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న యామిగౌతమ్ కు ఇది పెద్ద షాక్ అని చెప్పాలి.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నందుకు యామి గౌతమ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నోటీసులు ఇచ్చింది. ఆమెకు ఈ నోటీసులు రావడం ఇది రెండోసారి.
ఈసారి ముంబై ఈడీ విభాగం నుంచి ఆమెకు నోటీసులు అందాయి. జూలై 7 లోపు ఆమె ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఆమె ప్రైవేట్ బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద విదేశీ ద్రవ్య లావాదేవీలు జరిగినట్లు తేలింది. దీంతో మొదటి సారి ఆమెను గతంలోనే పిలిచి విచారించారు. ఇపుడు రెండోసారి ఆమెకు నోటీసులు అందాయి.
యామి గౌతమ్ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో చిత్రనిర్మాత ఆదిత్య ధార్ తో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.