కరోనాపై సీఎం జగన్ చేతులెత్తేశారని స్వయంగా వైసీపీ నేతలే చెప్పుకుంటున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కరోనాతో సహజీవనం తప్పదంటూ మెట్టవేదాంతం చెప్పిన జగన్…బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ తో కరోనాకు చెక్ పెట్టవచ్చంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని టీడీపీ నేతలు మండిపడ్డ సంగతి తెలిసిందే. ఈ తరహాలో జగన్ నిర్లక్ష్యానికి ఏపీలో వేలాదిమంది కరోనాబారినపడి మరణించారు. ఈ క్రమంలోనే కరోనా బాధితుల వ్యవహారంలో జగన్ నిర్లక్ష్యంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమర శంఖం పూరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు.
కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ‘సాధన దీక్ష’ చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాడు15 మంది సీనియర్ నేతలతో కలిసి దీక్ష ప్రారంభించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. దీంతోపాటు 175 నియోజకవర్గాల్లో ‘సాధన దీక్ష’చేపట్టి తమ నిరసన వ్యక్తం చేయాలని ఆందోళనలకు టీడీపీ పిలుపునిచ్చింది.
ముందుగా దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి దీక్షను చంద్రబాబు ప్రారంభించారు.12 డిమాండ్ల సాధనే లక్ష్యంగా దీక్షకు దిగారు. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, రానానాయుడు యనమల, సోమిరెడ్డి, చినరాజప్ప, ఫరూక్, వర్ల, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, అనగాని, బోండా, అనిత, బీదా రవిచంద్ర, మంతెన సత్యన్నారాయణ రాజు, టీడీ జనార్దన్, గుమ్మడి సంధ్యారాణి, అశోక్ బాబు తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
టీడీపీ ప్రధాన డిమాండ్లు ఇవే…
ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి తక్షణసాయంగా రూ.10 వేలు ఆర్థిక సాయం
కరోనా తీవ్రత కొనసాగినంత కాలం నెలకు రూ.7,500 ఆర్థిక సాయం
కరోనా మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.10 లక్షలు ఆర్థిక సాయం
ఆక్సిజన్ అందక మరణించిన బాధితుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం
వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపు
విధి నిర్వహణలో చనిపోయిన కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం
జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా గుర్తించి వారికి బీమా సౌకర్యం కల్పించడం
వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించడం