వైసీపీ నేత, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తారన్న సంగతి తెలిసిందే. గతంలో నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన భాస్కర్ భూషణ్ ను ప్రసన్న కుమార్ రెడ్డి పబ్లిక్ గానే అవమానకరరీతిలో విమర్శించడం పెను దుమారం రేపింది. భాస్కర్ భూషణ్ టీడీపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని, తనతో పెట్టుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇక, తాజాగా జగనన్న ఇళ్లపై జరిగిన హౌసింగ్ రివ్యూలో పాల్గొన్న ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇళ్లలో హాల్లో శోభనం చేసుకొని…బెడ్రూమ్ లో నిద్రపోవాలంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. జగనన్న ఇళ్లలో బెడ్ రూమ్స్ చాలా చిన్నవిగా ఉన్నాయని, పెళ్ళయిన కొత్త జంటలకు శోభనానికి చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ ‘ఏ’ గ్రేడ్ కామెంట్స్ పేల్చడంతో అక్కడివారంతా అవాక్కయ్యారు.
బెడ్ రూమ్ లో పెద్ద మంచం వేయాల్సి వస్తే కష్టంగా ఉంటుందని, బాత్ రూమ్ బయట ఏర్పాటుచేసి బెడ్రూమ్ సైజు పెంచాలని, ఇళ్లు ప్రభుత్వమే నిర్మించాలని సలహా ఇచ్చారు. ఇక, అర్బన్ ప్రాంతాల్లో కేవలం 6 అంకణాల్లోనే ఇళ్లు నిర్మించబోతున్నారని, అక్కడ ఇళ్లలో హాల్లో శోభనం చేసుకొని
బెడ్రూమ్లో పడుకోవాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. అయితే, జగనన్న ఇళ్లపై స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ తరహా సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రసన్నకుమార్ రెడ్డి కామెంట్స్‌పై జగన్ స్పందన ఏవిధంగా ఉండబోతోందో వేచి చూడాలి.