తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత హిందీ సినీ పరిశ్రమలోకి వెళ్లి అక్కడా ప్రత్యేకతను చాటుకున్న భామ ఇలియానా. ఇక్కడా అక్కడా పెద్ద పెద్ద స్టార్లతో నటించిన ఇలియానా.. బాలీవుడ్‌కు వెళ్లాక బాగా ఔట్ స్పోకెన్ అనే పేరు తెచ్చుకుంది. తరచుగా బోల్డ్ కామెంట్లు చేయడం ఆమెకు అలవాటైంది.
తాజాగా తన శరీర సౌష్ఠవం గురించి ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టులో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తన నడుం, తొడలు, వక్షోజాల గురించి ఆమె ఇందులో చాలా ఓపెన్‌గా మాట్లాడేసింది. తన శరీరం ఇతరులకు ఎలా కనిపిస్తుందో..ఎవరేమనుకుంటారో అని ఆత్మవిశ్వాస లోపంతో ఆలోచించేదాన్నని ఇలియానా వ్యాఖ్యానించడం విశేషం. ఇంతకీ తన పోస్టులో ఇలియానా ఇంకా ఏమందంటే..
నేను బయట వారికి ఎలా కనపడుతున్నానో అని బాధపడుతుండేదాన్ని. నా నడుం చాలా వెడల్పుగా ఉంటుంది అనుకునేదాన్ని. నా తొడలు చాలా పెద్దవిగా ఉంటాయని అనిపించేవి. నా నడుము సన్నదిగా కాదని, నా వక్షోజాలు అనుకున్నంత పెద్దవి కావని.. నా ఉదరం చదునుగా లేదని.. నా వెనుక భాగం పెద్దదిగా ఉందని.. నా భుజాలు బలహీనంగా ఉంటాయని.. ముక్కు నేరుగా లేదని.. పెదాలు అందంగా లేవని.. నేను ఎత్తుగా లేనని.. ఇలా రకరకాలుగా బాధపడుతుండేదాన్ని.
నేను స్మార్ట్‌గా, పర్ఫెక్ట్గా లేనని అనుకుంటుంండేదాన్ని. అలాగని నేను ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని అనుకోలేదు. నాలోని ప్రతి ప్రతికూల విషయాన్ని, అలాగే భయాన్ని వదిలిపెట్టి నన్ను నేను మలుచుకున్నాను. నా అందం నాదే అని భావించాను. ప్రపంచం అందం అని అనుకునేదాని గురించి ఆలోచించి నేనెందుకు ఆగాలి. అందులో ఇమిడాలని నేను ఎందుకు ప్రయత్నించాలి అని ఆలోచించి ఆగాను. నాకు నేనుగా నిలబడ్డాను అంటూ తనలో తాను ఎలా స్ఫూర్తి నింపుకున్నది వివరించింది ఇలియానా.