విజయ్ దేవరకొండ…టాలీవుడ్ లోని యంగ్ హీరోలలో అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడీ రౌడీ హీరో. అర్జున్ రెడ్డి వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలో జీవించిన విజయ్…ఆ తర్వాత గీత గోవిందంలో అమాయకుడైన లవర్ బాయ్ గా మెప్పించాడు. ఆ తర్వాత ఈ రౌడీ హీరో ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ సినిమా పడలేదు. అయితే, తాజాగా విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం ‘లైగర్’పై రౌడీ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు.
ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలున్నాయయి. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రానికి ఓ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందట. కరోనా నేపథ్యంలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్, అన్ని భాషల్లో శాటిలైట్ రైట్స్‌కు కలిపి రూ.200 కోట్లు డీల్ ఆఫర్ చేసిందట. అయితే, ఈ ఆఫర్ అలా ఉండగానే….దీనిపై విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.
ఇది చాలా చిన్న మొత్తం అని…థియేటర్లో విడుదలైతే ఇంతకన్న భారీ మొత్తంలో కలెక్షన్లు వస్తాయని రౌడీ హీరో ట్వీట్ చేశాడు. విజయ్ తాజా ట్వీట్ తో ఈ చిత్రం ఓటీటీ లో కాకుండా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని చెప్పకనే చెప్పాడని అంటున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పూరీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్యపాండే సందడి చేయనుంది.