3 సంవత్సరాల క్రితం నీతిఆయోగ్ నివేదికలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నాణ్యమైన విద్య లో దేశంలో 3 స్థానం లో ఉన్నది
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 2019 -2020 లో దేశంలో లోనే 18 వ స్థానం 2020-2021 లో 19 వ స్థానంలో నిలచింది. అక్షరాస్యత లో 27 వ స్థానంలో నిలిచిందని నీతిఆయోగ్ నివేదిక తెలిపింది. దేశంలో ఉన్నది 28 రాష్ట్రాలు. కింద నుంచి 28వ స్థానంలో బీహార్, 27వ స్థానంలో మనం అన్నమాట.
మన ప్రక్క రాష్ట్రాలు తమిళనాడు 5 వ, కర్ణాటక 7 వ, తెలంగాణ 10 వ స్థానం లో ఉన్నాయి.
మూడు రాజధానులు వచ్చాక చదువు కాకి ఎత్తుకుపోయింది. చివరకు మనం పోటీ పడుతున్నది బీహార్ రాష్ట్రం తో
ఆంధ్రాకు 100 కు 50 పాయింట్లు, బిహార్ కు 45 పాయింట్లు పాయింట్లు వచ్చాయట.
ఇది ఇలాగే కొనసాగితే మన రాష్ట్ర విద్యార్థులకు మన రాష్ట్రం లోనే కాదు బయట కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు ఇవ్వరు. ఏపీలో చదివాం అంటే… resume ను చెత్త బుట్ట లో వేసే రోజులు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు.
పెద్దలు చెప్పినట్టు వ్రతము చెడిన పూజ ఫలించాలి అంటారు… ఏపీ రెంటికీ చెడ్డ రేవడిగా మారింది.
అయినా జగనన్న పథకాలు ఉండగా… కష్టపడి చదివి సంపాయించాల్సిన అవసరం ఏముంది అంటారా… అలాగే కానివ్వండి మరి.