టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరక విధానాలపై ఉద్యమించేందుకు రెడీ! అంటూ.. తాజాగా ఆయన ప్రకటించారు. అంతేకాదు.. ప్రస్తుతం ఈ నెల 16 నుంచి జగన్ సర్కారుపై ఉద్యమించేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేస్తామని.. వారికి సంఘీభావం ప్రకటిస్తామని .. చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ మేరకు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చంద్రబాబు పార్ట ముఖ్యనేతలతో అర్జంట్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా మృతులకు ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదాయం కోల్పోయిన వారికి రూ. 10 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
10 డిమాండ్లతో ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన తహసీల్దార్ కార్యాలయాలల్లో , 18వ తేదీన రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో, 20వ తేదీన కలెక్టర్ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని తీర్మానం చేశారు.
అలాగే ఈ నెల 22వ తేదీన 175 నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించారు. మాన్సాస్ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పుపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పన్నుల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 15, 16వ తేదీల్లో అఖిలపక్ష పార్టీల నిరసనకు సంఫీుభావం తెలిపారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మందు తయారీలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సమావేశంలో చంద్రబాబు ఖండించారు. ఈ పరిణామాలతో జగన్ సర్కారు ఉక్కిరి బిక్కిరికి గురవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.