రూల్ అంటే రూల్. మంత్రి అయినా ఇంకెవరైనా నిబంధనల్ని పాలించాల్సిందేనంటూ తిరుపతి ఎయిర్ పోర్టు అధికారులు ఏపీ రాష్ట్రఆర్థిక మంత్రి బుగ్గన రాజేందకు షాకిచ్చారు.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తాజాగా తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించిన అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు పలువురు వైసీపీ నేతలు వెంట వచ్చారు. వారిలో ఆర్థిక మంత్రి బుగ్గన ఒకరు. ఆయన్ను ఎయిర్ పోర్టు అధికారులు అడ్డుకున్నారు.
రన్ వేకు వెళ్లే రెండో గేట్ వద్ద మంత్రి బుగ్గనను అడ్డుకున్నట్లుగా చెబుతున్నారు. తాను రాష్ట్ర ఆర్థిక మంత్రినని చెప్పినప్పటికి సిబ్బంది లోపలకు పంపేందుకు అనుమతించలేదు.
ఒక దశలో ఆయన మాట వినిపించుకోకుండా పక్కకు తోసేసినట్లుగా చెబుతున్నారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీంతో.. సెక్యురిటీ సిబ్బంది పేర్లను తనకు ఇవ్వాలని మంత్రికోరినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఎయిర్ పోర్టు ఆధారిటీ వారి వివరణ చూస్తే..కేంద్రమంత్రికి వీడ్కోలు పలకటానికి ఒక జాబితాను తమకు ఇచ్చారని.. అందులో బుగ్గన పేరు లేదని అందుకే ఆయన్ను లోపలకు అనుమతించలేదని చెబుతున్నారు.
జాబితాలో ఉన్న వారికి తప్పించి.. ఇంకెవరు వచ్చినా వారికి అనుమతి ఇవ్వలేమని ఎయిర్ పోర్టు టెర్మినల్ మేనేజర్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మరీ.. ఉదంతం ఎక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
అయినా రూల్స్ తెలుసుకోకుండా పోయి… రూల్స్ పాటించిన సెక్యూరిటీ వారిపై పగ పెంచుకోవడం అంటే ఎవరైనా నిజాయితీగా పనిచేస్తే వైకాపా ప్రభుత్వం దానిని ఒక తప్పులా చూసే పరిస్థితి వచ్చింది.