అంచనాలు మరోసారి నిజమయ్యాయి. ముందుగా చెబుతున్నట్లే మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల మీద భూ కబ్జాఆరోపణలు పడటం.. ఆ ఉదంతంలో మంత్రి వర్గం నుంచి తొలగించటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీజేపీలోకి చేరేందుకు ఈటల రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా స్పీకర్ కు పంపిన రాజీనామా లేఖలో ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు. సింఫుల్ గా సింగిల్ లైన్ లో ఆయన తన రాజీనామా లేఖను పూర్తి చేశారు.
జూన్ 12, 2021 నుంచి తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరి.. టీఆర్ఎస్ పార్టీకి చేసే రాజీనామాలో అయినా కారణాన్ని వెల్లడిస్తారా? అది కూడా ఒక్క లైన్ లో తేల్చేస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తూన్న మాజీ మంత్రి శ్రీ ఈటల రాజేందర్. https://t.co/RcNTr0qAqx
— Eatala Rajender (Modi Ka Parivar) (@Eatala_Rajender) June 12, 2021