టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ పొలిటికర్ రీ ఎంట్రీ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. 2023 ఎన్నికల నాటికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తారని, టీడీపీ తరఫున 2009 ఎన్నికల తరహాలో ముమ్మర ప్రచారం చేస్తారని తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కొందరు ఎన్టీఆర్ అభిమానులు మరో అడుగు ముందుకు వేసి కుప్పంలో కట్టిన తారక్ బ్యానర్లు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించాయి. ఆ బ్యానర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆరా తీశారు.
ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీపై నటసింహం నందమూరి బాలకృఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బాలయ్య బాబు…తారక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా.? అనే ప్రశ్నకు లెజెండ్ తనదైన శైలిలో జవాబిచ్చారు. ”ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి. ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తారా.? లేదా.? అనే విషయాన్ని నేను పెద్దగా ఆలోచించడం లేదు” అని బాలకృష్ణ తేల్చేశారు.
ఒకవేళ ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి వస్తే.. అది పార్టీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారా.? అన్న ప్రశ్నకు హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలయ్య….పక్కా పొలిటిషిన్ లాగా రిప్లై ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ప్లస్ అయి.. తర్వాత మైనస్ అయితే అంటూ నవ్వుతూనే సమాధానమిచ్చారు బాలయ్య. తెలుగుదేశం పార్టీ ఓ ఆవేశంలో నుంచి పుట్టిందని.. పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడూ పారదర్శకంగా ఉంటారని బాలయ్య ఈ సందర్భంగా అన్నారు. ఇక అలాంటివరికే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి, బాలయ్య వ్యాఖ్యలపై తారక్ స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.