ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. సునీల్‌కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ… లీగల్ రైట్స్ అడ్వైజరీ(ఎల్ఆర్వో) కన్వీనర్ ఎన్ఐ జోషి ఫిర్యాదు చేశారు. ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది… క్రిస్టియన్‌గా మతం మార్చుకున్న సునీల్‌కుమార్ ను సర్వీస్ నుంచి తప్పించాలని ఫిర్యాదులో జోషి అభ్యర్థించారు.
సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో… సునీల్‌కుమార్ ప్రారంభించిన సంస్థపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పేర్కొన్నారు. అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్ ప్రోత్సహించారని, సునీల్‌కుమార్‌పై సెక్షన్ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్ఐఆర్ సమోదు చేసి… పూర్తిస్థాయిలో హోంశాఖ దర్యాప్తు చేయాలని ఎల్ఆర్వో కన్వీనర్ ఎన్ఐ జోషి డిమాండ్ చేశారు.
కాగా, మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‌ను వదలుకోవాలంటూ.. రెండు రోజుల కిందట మద్రాస్ హైకో ర్టు ఓ కేసు విషయంలో తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లను ఇస్టానుసారం.. మార్చుకుంటామంటే.. కుదరదని కూడా కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇప్పటి వరకు ఇలా అక్రమ మార్గంలో ఉద్యోగాలు సంపాయిం చుకున్న వారిని తక్షణమే ఇంటికి పంపించాలని.. కూడా తమిళనాడు సర్కారును హైకోర్టు ఆదేశించింది.
ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ తీర్పు ఆధారంగానే ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని జోషి డిమాండ్ చేయడం గమనార్హం. మరి కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.