https://twitter.com/juicythoppul/status/1399419803849302020
ఒక గల్లీ లో అందమైన అమ్మాయికి పెళ్లయితేనే ఎంతో మంది ఆ వీధి యువకులు డిజప్పాయింట్ అవుతారు.
మరి బాపు లాంటి హీరోయిన్ ప్రణీతకు పెళ్లయితే ఎన్ని గుండెలు నీరుగారి పోతాయి. చాలా కామనే ఇది.
ఏడాదిన్నరగా ఎవరి పరిస్థితి గొప్పగా లేదు. సినిమావాళ్ల పరిస్థితి అయితే… పరమ బోరింగ్. ఏం చేయాలో కూడా తెలియదు.
ఇపుడపుడే ఇండస్ట్రీలో టకటకా అవకాశాలు వచ్చే పరిస్థితి లేదు. అందుకేనేమో ఈ గొడవంతా ఎందుకు అని ప్రణీత పెళ్లాడేసింది. కానీ ఈ పెళ్లి గురించి ఇంత హింట్ కూడా లేకుండా ఒక తోటలో అతికొద్ది మంది అతిథుల మధ్య కానిచ్చేసింది.
హీరోయిన్ ప్రణీత.. తన ప్రియుడు నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి వేడుక బెంగళూరులోని ప్రణీత ఫాం హౌస్ లోనే జరిగింది.