రఘురామరాజు విషయంలో చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులకు రాజుగారు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. వారు తన మీద ప్రయోగించిన వ్యూహాత్మక అస్త్రాలనే ఆయుధాలుగా చేసుకుని రాజు గారు పోరాటం మొదలుపెట్టారు.
గుంటూరు అర్బన్ ఎస్పీకి రఘురామకృష్ణరాజు న్యాయవాది దుర్గాప్రసాద్ కోర్టు ధిక్కార నోటీసులు పంపారు.
రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తీసుకురావాలని ఎస్కార్ట్‌ను ఆదేశించినట్లు సమాచారం అందింది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రఘురామ బెయిల్ పై విడుదలైనట్లే.
విడుదలైన 10 రోజులకు బాండ్లను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రఘురామను తీసుకురావాలని ఎస్కార్ట్ ను పంపడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లే కాబట్టి… అందుకే నోటీసులు ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు రఘురామ న్యాయవాది దుర్గాప్రసాద్.
హైదరాబాద్ నుంచి గుంటూరు అర్బన్ ఎస్పీకి నోటీసులు పంపించారు. ఇపుడు మరి ఎస్పీ ఎలా స్పందిస్తారు? ఆయన దీనిని ఎలా ఎదుర్కొంటారన్నది పెద్ద సస్పెన్స్ గా ఉంది.