తెలుగు న్యూస్ ఛానెల్ లో ప్రముఖ న్యూస్ ప్రజెంటర్గా కొనసాగుతున్న రజనీకాంత్ పై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేనీ అంశంపై మాట్లాడాలంటే… ఆయా అంశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటుగా ఆయా రంగాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అంతేగానీ… మిడిమిడి పరిజ్ఞానంతో తెర మీదకు వచ్చే వారి వాదనలు డొల్లగానే ఉంటాయని చెప్పక తప్పదు. అసలు అలాంటి వ్యక్తులు తమకు పరిచయం లేని విషయాలపై మాట్లాడేందుకు సాహసించరు. ఈ తరహా వాదనలకు టీవీ 9 రజనీకాంత్ విరుద్ధం. చదివింది టెన్త్ క్లాసే అయినా… అన్ని విషయాలపై తనకు అమోఘమైన అవగాహన ఉన్నట్లుగా రజనీకాంత్ ఫోజు కొడుతున్న వైనం చాలా రోజుల నుంచే వివాదాస్పదంగానే మారిపోయింది.
ఇప్పుడు మరోమారు రజనీకాంత్ అజ్ఞానంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఎందుకంటే… కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద నిపుణుడు బొరివి ఆనందయ్య ఇస్తున్న మందుపై టీవీ 9 చర్చా వేదికపై రజనీకాంత్ తనదైన శైలి కొత్త భాష్యాలు చెబుతున్న వైనమే ఇందుకు కారణమని చెప్పాలి. ఆనందయ్య స్వతహాగా రాసుకున్న పుస్తకాల ద్వారానో సొంతం పరిజ్ఞానంతోనే ఈ మందును తయారు చేయడం లేదు. తమిళనాడులోని ఆయుర్వేద నిపుణుల ద్వారా ఆయుర్వేద మెళకువులను నేర్చుకున్న ఆనందయ్య… వాటి ఆధారంగానే ఎన్నో వ్యాధులకు మందులను తయారు చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఇస్తున్న మందుల కారణంగా ఇప్పటిదాకా ఒక్కరంటే ఒక్క కరోనా బాధితుడు కూడా ఇబ్బంది పడిన దాఖలా లేదనే చెప్పాలి. అంతేనా… ఆనందయ్య మందు తీసుకున్న నిమిషాల వ్యవధిలో శ్వాస ఇబ్బందుల నుంచి బయటపడిన వారు కొందరైతే… ఆ మందుతో కరోనా నుంచి కోలుకున్న వారు వేల మందే ఉన్నారు. ఇక ఆనందయ్య మందు కారణంగా కృష్ణపట్నంలో ఇప్పటిదాకా కరోనాతో ఒక్కరంటే ఒక్కరు కూడా మరణించలేదు.
ఈ తరహా ఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ఏకంగా ఆనందయ్య మందుపై పరిశీలనకు పూనుకుంది. అంతేకాకుండా సదరు పరిశీలనలో ఆనందయ్య మందు ఎలాంటి దుష్ప్రభావాలను చూపదని కూడా తేల్చింది. ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం ఏకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కార్పొరేట్ ఆసుపత్రులకు తలొగ్గినట్టుగా ఆనందయ్య మందుపై తనదైన శైలి వక్రభాష్యాలు చెబుతూ… టీవీ 9 చర్చా వేదికపై రజనీకాంత్ ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న వైనం జనాన్ని ఆగ్రహావేశాలకు గురి చేస్తోందనే చెప్పాలి. అసలు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై తనదైన శైలి అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు రజనీకాంత్ ఏమైనా ఆయుర్వేద విద్యను అభ్యసించారా? అన్న దిశగానూ సెటైర్లు వినిపిస్తున్నాయి. అసలు రజనీకాంత్ విద్యార్హతలు ఏమిటన్నది ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తోంది. వాస్తవానికి రజనీకాంత్ చదివింది పదో తరగతి మాత్రమేనన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. పదో తరగతి దాకా చదువుకున్న రజనీకాంత్ ఆయా అంశాల్లో తనను మించిన నిపుణుడు లేడన్న రీతిలో వాదనలు వినిపిస్తున్న వైనం పలువురిని ఆగ్రహానికి గురి చేస్తోంది.
ఆనందయ్య మందుపైనే కాకుండా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్, ఆయనపై పోలీసులు ప్రయోగించిన థర్డ్ డిగ్రీ, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిన విషయాలపై జరిపిన చర్చల్లోనూ రజనీకాంత్ తనదైన శైలి వాదనలు వినిపించారు. పదో తరగతి చదివిన రజనీకాంత్ కు ఇండియన్ పీనల్ కోడ్ పై ఏ మేర అవగాహన ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రఘురామరాజుపై పోలీసులు సాగించిన దమనకాండపై స్వయంగా సుప్రీంకోర్టే ఆగ్రహం వ్యక్తం చేస్తే… రఘురామరాజుదే తప్పన్నట్లుగా, ఏపీ సీఐడీ పోలీసులను వెనకేసుకొచ్చినట్లుగా రజనీకాంత్ తన చర్చల్లో వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదంగా మారుతోంది. ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అటు సుప్రీంకోర్టుతో పాటు ఇటు హైకోర్టు కూడా వరుసగా అక్షింతలు వేస్తుంటే… పోలీసుల తీరు సరైనదేనన్న రీతిలో రజనీకాంత్ తనదైన శైలి వ్యాఖ్యలు చేస్తున్న తీరు నిజంగానే ఆక్షేపణీయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా టెన్త్ చదివిన రజనీకాంత్ మొత్తం అన్ని శాస్త్రాలను ఔపోసన పట్టినట్టుగా మాట్లాడుతున్న తీరుపై నిజంగానే జనంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయనే చెప్పాలి.