ఒక్క రూపాయి తీసుకోకుండా
కార్పొరేట్ వైద్యం చేయలేని పని చేస్తున్నట్టు ఆనందయ్య గురించి ప్రచారం జరుగుతోంది.
ఎవరీ ఆనందయ్య అంటే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఆయుర్వేద వైద్యుడు.
కరోనాను 2 రోజుల్లో తగ్గిస్తున్నాడట.
కృష్ణపట్నం రేవు ప్రాంతంలో ఈయన అందరికీ సుపరిచితుడు.
గత మొదటి వేవ్ నుంచి తొలుత కుటుంబంపై, ఆ తర్వాత బంధువులపై తన మందుతో చేసిన వైద్యం సక్సెస్.
ఇది ఆ నోటా ఈనోటా చేరింది.
దీంతో జనమంతా పోటెత్తారు.
వేర్వేరు రాష్ట్రాల నుంచి ఆయన మందుకోసం ఆయన ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.
అదేమీ అరుదైన మందు కాదని, దానిని ఎలా తయారుచేస్తానో కూడా ఆయన పబ్లిగ్గానే చెప్పేశాడు.
అయినా జనం ఆయన వెంటపడుతున్నారు.
రెండు మూడు రోజులుగా జనం లక్షలాదిగా ఆయన ఇంటి వద్ద క్యూ కట్టారు.
వారిని అదుపు చేసే శక్తి కూడా ఆయనకు లేదు.
గవర్నమెంటుకూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.
దీంతో విపరీతమైన తోపులాట జరుగుతోంది.
కరోనా నివారణకు ఆనందయ్య గారు ఇచ్చే ఆయుర్వేద మందు కోసం లక్షలకొద్దీ జనం బారులు దీరారు..#CoronaMedicine #KrishnaPatnam #Nellore #AP #AyurvedicTreatment4Corona pic.twitter.com/o0OIsw3dpS
— Balaji Gupta (@BalajiGupta) May 21, 2021
https://twitter.com/Prady__Pradeep/status/1395429638080327687
ఇది మా ఊరు కృష్నాపట్నం కి పక్కన ఉన్న గోపాలపురం.ఎప్పుడు కాలిగా ఉండే రోడ్లు ఇప్పుడు ఆనందయ్య గారి మందు వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కరోనా కి మందు ఇస్తూ ఎంతో మందిని రికవర్ చేస్తున్నారు.ఆయుర్వేదం మీద నమ్మకంతో ఎంతోమంది ఈ మందు వాడుతున్నారు. pic.twitter.com/G4K20YoolQ
— Mr.A (@akashgoud38) May 21, 2021