ఆసక్తికర పరిణామాలకు వేదికగా మారింది ఏపీ అసెంబ్లీ ఒకరోజు సమావేశం. జగన్ ని పొగడటమే ప్రధాన లక్ష్యంగా సాగింది సభ.
బడ్జెట్ కోసం ఒక రోజు సమావేశాన్ని నిర్వహించిన నేపథ్యంలో.. తమ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ వ్యవహారాన్ని సభలో ప్రస్తావించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో ఎంపీ రఘురామపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జోగి రమేశ్.
తీవ్రస్థాయిలో తిట్టిపోయటమే కాదు.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ గుర్తు.. అధినేత ఫోటోతో గెలిచిన రఘురామ.. తన పదవికీ రాజీనామా చేస్తే వార్డు మెంబరుగా కూడా గెలవరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తిట్టాల్సిన తిట్లు తిట్టేసిన తర్వాత.. వేరే సభలో సభ్యుడి గురించి అసెంబ్లీ సమావేవంలో విమర్శించటం తప్పన్న జోగి.. తాను మాట్లాడిన దాంట్లో తప్పులు ఉంటే.. ఆ మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు.
వాస్తవానికి సభలో లేని వారి గురించి.. సభకు సంబంధం లేని వారి గురించి మాట్లాడాలన్నా.. వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా స్పీకర్ అడ్డుకుంటారు. అయితే.. అలాంటిదేమీ జరగలేదు సరికదా.. తిట్టాల్సిన తిట్లు తిట్టేసిన జోగి.. చివరకు తన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని స్వయంగా కోరటం ఆసక్తికరంగా మారింది.
అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జోగిని పల్లెత్తు మాట అనలేదు. జోగి రమేశ్ కు థ్యాంక్స్ చెప్పాలని.. కంగ్రాట్స్ చెప్పాలన్న ఆయన.. జోగి రమేశ్ బాధలో అప్యాయత కనిపించిందన్నారు.
రికార్డుల నుంచి తన వ్యాఖ్యల్ని తొలగించాలని కోరటాన్ని తాను అభినందిస్తున్నట్లు చెప్పారు. తిట్టటం సరికాదని అనిపించినప్పుడు అంత బాహాటంగా తిట్టేయటం ఏమిటి? తిట్టేసిన తర్వాత వ్యాఖ్యల్ని తొలగించాలని కోరటం ఏమిటి? ఈ మొత్తానికి ముఖ్యమంత్రి అభినందించటం ఏమిటన్నది అసలు ప్రశ్న.
ఏమైనా.. తాను తిట్టాలనుకున్నట్లుగా తిట్టేసి.. తీరిగ్గా వ్యాఖ్యల్ని తొలగించాలని కోరటం జోగికి మాత్రమే సాధ్యమేమో?
అసలు అసెంబ్లీలో అబద్ధం అనే పదం కూడా అసెంబ్లీ నియమాలకు విరుద్ధం కేవలం సత్యదూరం అనే పదాన్ని వాడాలి
అట్లాంటి శాసనసభలో ఇంత నీచమైన భాష వాడుతున్న జోగి రమేష్ అసలు ఎమ్మెల్యే గా అనర్హుడు… https://t.co/wzKdodOa8W— SAengali (@SAengali) May 20, 2021