రఘురామరాజు కేసు వ్యవహారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వైకాపా సర్కారు రఘురామరాజును రాజద్రోహం కేసు కింద అరెస్టు చేసింది.
నిజానికి రఘురామరాజ కంటే ఘోరంగా ఎన్నోసార్లు జగన్, సాయిరెడ్డి చంద్రబాబును విమర్శించారు.
కానీ ఏ రోజు అలాంటి కేసులు వారిపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టలేదు.
కానీ జగన్ తనను విమర్శిస్తున్నాడనే అక్కసుతో తన పార్టీలో కులాల గురించి మాట్లాడేవారిని వదిలేసి రఘురామపై రాజద్రోహం కేసు పెట్టడం, అరెస్టు చేయడం, లోపలేసి కొట్టడం ఇవన్నీ చూశాం.
అయితే, అనూహ్యంగా రఘురామరాజు వారి చెరనుంచి చట్టపరంగా తప్పించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ వ్యవహారంలో రఘురామ కుటుంబం ఢిల్లీలో చాలా వేగంగా వ్యవహరిస్తున్న తీరు కలుస్తున్న వ్యక్తులు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి.
జగన్ ఎంతో తాపత్రయపడే అమిత్ షా అపాయింట్మెంట్ రఘురామ ఫ్యామిలీ అడిగిన వెంటనే దొరికింది.
తాజాగా లోక్ సభ స్పీకరు ఓంబిర్లాను కూడా రఘురామకుటుంబం కలిసింది. జగన్ సర్కారు రఘురామరాజను వేధిస్తున్నదని లోక్ సభ స్పీకరుకు వారు వినతి పత్రం ఇచ్చారు.
రఘురామ ప్రాణానికి ముప్పు ఉందని … కాపాడాలని వారు విజ్జప్తి చేశారు.