ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వైఫల్యం వల్లనే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం ఆక్సిజన్ కొరత లేదని చెబుతోంటే…మరోవైపు, తాజాగా ఆక్సిజన్ అందక కర్నూలులో 6గురు పేషెంట్లు చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఇంత జరుగుతున్నా వైసీపీ నేతలు మాత్రం తాము గొప్ప అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
కరోనా పేషెంట్ల కోసం10 వేల లీటర్ల ఆక్సిజన్ ను కుప్పం వైసీపీ ఇన్ చార్జ్ భరత్ డొనేట్ చేశారంటూ వైసీపీ నేతలు ట్విటర్ లో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు ఆక్సిజన్ ఏమీ డొనేట్ చేయలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫ్యాన్స్ ట్విటర్ లో స్పందించారు. చంద్రబాబు పిలుపు ప్రకారం టీడీపీ అభిమానులు కొన్ని లక్షల లీటర్ల ఆక్సిజన్ ను డొనేట్ చేశారని వెల్లడించారు. అంతేకాదు, తాము డొనేట్ చేసిన ఆక్సిజన్ తాలూకు స్క్రీన్ షాట్లు తీసి మరీ వైసీపీ ఇన్ చార్జ్ భరత్ గాలి తీశారు.
అంతకుముందే, కరోనాతో పోరాడుతున్న ప్రజలకు సాయపడేందుకు తెలుగుదేశం పార్టీ “Hope. Help.” అనే వేదికను ప్రారంభించి ఆపన్నులకు అండగా నిలుస్తోందంటూ ట్వీట్ చేశారు. ట్విట్టర్ ద్వారా @jaitdpకి #SOSTDP అని ట్వీట్ చేస్తే చాలు. వెంటనే స్పందించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని తగిన సాయం చేస్తోందని వెల్లడించారు. తాము చేతల్లో చూపిస్తామని వైసీపీ నేతలు మాటల్లో చెబుతారని టీడీపీ అభిమానులు వైసీపీ గాలి తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఏపీ రాజకీయ వర్గాల్లో ట్రెండ్ అవుతోంది.