తక్కువ సమయంలో పార్టీలో ఉన్నత స్ధాయికి ఎదిగిన యువకుడు.
పార్టీ నాయకత్వం పూర్తి గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు.
ఆయన కూడా విషయజ్ఞానం వాక్పటిమ కలిగి అప్పటి ప్రభుత్వ ఆర్ధిక అరాచకం ప్రజలకు సమర్ధవంతంగా వివరించారు.
పార్టీ అగ్రనాయకత్వానికి మరింత చేరువయ్యారు.
ముఖ్యసమావేశాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు.
అధిష్ఠానం తో నేరుగా సత్సంబంధాలు ఏర్పడ్డాయి అనే కంటే వారు దగ్గర తీసుకున్నారని చెప్పవచ్చు.
అధికారం లోకి వచ్చిన తర్వాత మొదటి విడత నామినేటడ్ పదవి దక్కక పోయేసరికి తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు.
అది అనుభవరాహిత్యాన్ని సూచిస్తున్నది.
ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ని నేరుగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
అలాగే సీనియర్ అధికారి మీద కూడా ఆరోపణలు విమర్శలు చేసారు.
అది పెద్దాయనకు కొంచెం ఇబ్బంది కలిగినా రెండవ విడత లో పదవి ఇచ్చారు.
ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి నిజాయితీ గా పని మొదలు పెట్టారు.
నాయకుడి మానస పుత్రిక ఫైబర్ నెట్ సంస్ధ..జగన్ హయాంలో భ్రష్టు పట్టిపోయింది.
అయిన వాళ్ళకి ఇంట్లో పనివాళ్ళకి జీతాల రూపంలో కొల్లగొట్టారు.
సంస్ధ ఉనికి ని ప్రశ్నార్ధకం చేసారు.
ఆర్జీవి లాంటి వారికి కోటి రూపాయలు పైన దోచి పెట్టారు.
ఇవన్నీ ప్రక్షాళన చేసి..రికవరీ కార్యక్రమం మొదలు పెట్టారు ఛైర్మన్..!
దీనికి పెద్దల మద్దతు ఉన్నది.
మూడు వందల మంది హాజరు కాని హాజరు లేని వారిని తొలగించే నిర్ణయం తీసుకున్నారు.
సంస్ధ యండీ, ఛైర్మన్ కి ఉద్దేశపూర్వకంగా సహకారం అందించలేదు.
ఇది రెండు నెలలు గా రగులుతున్నది.
ఇక్కడ వరకు అగ్రనాయకత్వం ప్రభుత్వ పెద్దలతో పూర్తి సత్సంబంధాలు ఉన్నాయి..సమన్వయం ఉన్నది.
తర్వాత వివాదం మొదలయినది ఛైర్మన్ ప్రెస్ మీట్..!
ఇది ఏక పక్షం..!
తీవ్ర వ్యాఖ్యలు..!
అధికారుల కినుక..!
ప్రెస్ మీట్ కి ముందు సీయమ్ ఇతర ముఖ్యులకు తెలియచేసి పని పూర్తి చేసుకోవాలి.
ఛైర్మన్ అనుకున్నది జరగాలన్నా, మొత్తం ప్రక్షాళన జరగాలన్నా అది చాలా పెద్ద తతంగం..!
చూడడానికి వినటానికి చిన్నగా అనిపించవచ్చు.
ఆ ప్రాసెస్ లో ముఖ్యమంత్రి గారికి అనవసర చికాకు..వివాదం..అప్రతిష్ఢ..!
అసలు చంద్రబాబు సమర్ధత ను వేలెత్తి చూపిన ఘటన అది..!
రెండున్నర సంవత్సరాల పార్టీ తో ప్రయాణం..!
తక్కువ సమయంలో ముఖ్య స్ధానం..!
భవిష్యత్తులో మరింత స్ధాయికి చేరుకునే అవకాశం ఇచ్చేవారు.
అంత మోజు అగ్రనాయకత్వానికి..!
అలాంటిది ప్రభుత్వ ప్రతిష్ఠ..చంద్రబాబు గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించటం సహించరానిది.
అయినా పిలిపించి మందలించలేదు.
ఛైర్మన్ గారే అప్పాయింట్మెంట్ తీసుకుని కలిసారు.
అప్పుడు కూడా ఇలాంటి ముఖ్యమైన విషయాలు మొదట మా దృష్టికి తీసుకురావాలి కదా..సహనం ఉండాలి కదా అని మాత్రమే అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి వి పునరావృతం కాకూడదని హెచ్చరించారు.
దానికి ఆయన హర్ట్ అయినట్టున్నారు.
నేరుగా వచ్చి అన్ని పదవులకు రాజీనామా చేసారు.
చివరికి పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా..!
ఈ వ్యవహారం కేడర్ కి తప్పుడు సంకేతాలను పంపింది.
అసలే గత ఏడెనిమిది నెలలు గా అసంతృప్తి అసహనం ఉన్న కేడరు సులువుగానే మండి పడ్డారు.
ఎంత వరకు వెళ్ళారంటే చంద్రబాబునే మార్చేస్తామనే వరకు.
ఈ సందులో వైసీపి ముఠా దిగింది..!
ఏకంగా నాయకత్వాన్ని దూషించే వరకు వెళ్ళింది.
అధికార యంత్రాంగాన్ని అనుకున్నంత ఈజీ కాదు..దారిలో పెట్టటానికి.
వాళ్ళంతా జగన్ మాయలో మత్తులో..భక్తిలో ఉన్నారు.
వారిని క్రమంగా దారిలో పెట్టాలి.
ఆ క్రమంలో చర్యలు ఆలశ్యమయి ఉండవచ్చు.
ఇక్కడ చంద్రబాబు గారు చేసిన తప్పేంటి!?
ఆయన సీయమ్..!
తమకు చెప్పి చెయ్యమన్నారు.
కచ్చితంగా చెప్పే చెయ్యాలి.
కొన్ని సార్లు మంత్రుల మాట వినరు అధికారులు.
అలాగని రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటారా!?
నయానో భయానో దారిలోకి తెచ్చుకోవాలి..!
ఇక్కడ జీవిరెడ్డి తొందరపాటు..తను అనుకున్నది జరగలేదని ఉక్రోషం తో రాజీనామా చేసారు.
దానికి ఆత్మగౌరవం లాంటి పెద్ద పేరు అనవసరం.
అక్కడే ఉండి సాధించటం మాని కాడి పారేసారు.
ఆయన అక్కడ ఉంటే ఇక మీదట మంచిగా ఆయన అనుకున్నది సాధించేవాడు.
కొంత మంది కార్యకర్తలకు ఉపాధి దొరికేది.
యువకుడు కాబట్టి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలొచ్చేవి.
తను పోగొట్టుకున్నాడు.
ఇతరుల అవకాశాలు పోగొట్టాడు.
ఈ వ్యవహారం అంతా గమనించిన తర్వాత నాయకత్వం పదవుల పంపకంలో ఇంకా ఆలశ్యం చేస్తారు.
ఛైర్మన్ రాజీనామా చేసిన టైమింగ్ ఏ మాత్రం బాధ్యత లేదని అనిపిస్తుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఇలా చెయ్యటం తగునా..!
తక్కువ సమయంలో మంచి అవకాశాలు కల్పించిన పార్టీ..నాయకత్వానికి ఈయన ఏమి గౌరవం ఇచ్చారు!?
ఇది కరెక్టా!?
వ్యవస్ఞల్లో అవకతవకలు..విచారణ జాప్యాలు కొంచెం పక్కన పెడితే..!
ఓపిక సహనం సంయమనం లేకపోతే రాజకీయాల్లో కొసాగటం సాధ్యమవుతుందా!?
ఎంత మంది తమ సీట్లు పొత్తులో భాగంగా కోల్పోయారు..!
వారు వేచియుండటం లేదా!?
ఎంతో మంది జగన్ బాధితులు సమయం కోసం ఎదురు చూడటం లేదా!?
ఆలోచించండి..!