నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా `డాకు మహారాజ్`. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. థమన్ సంగీతం అందించారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న భారీ అంచనాల నడుమ విడుదలైన డాకు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ దాన్ని కొత్త ప్రజెంట్ చేయడంలో బాబీ సక్సెస్ అయ్యాడని విమర్శకులు ప్రశంసలు కురిపించారు. బాలయ్య యాక్షన్, బాబీ టేకింగ్ కు తోడు సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీతం చిత్రానికి బిగ్గెస్ ఎస్సెట్ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమాకు పాజిటిక్ రెస్పాన్స్ రావడంతో ఆదివారం చిత్ర బృందం సక్సెస్ పార్టీని నిర్వహించింది. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయవంతమైన చిత్రాల తర్వాత డాకు రూపంలో మరో హిట్ పడటంతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య.. సక్సెస్ పార్టీలో తన సన్నిహితులు, టాలీవుడ్ యంగ్ హీరోలైన విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డలతో తెగ హంగామా చేశారు.
విశ్వక్, సిద్ధులపై బాలయ్య ముద్దుల వర్షం కురిపించారు. వారు కూడా ముద్దులతో బాలయ్యపై తమ అభిమానం చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన సెల్ఫీ వీడియోను విశ్వక్ సేన్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ట్రెండింగ్ గా మారింది. మరి లేటెందుకు కింద ఉన్న ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.
Congratulations #NBK sir 🔥💥💥#DaakuMaharaj pic.twitter.com/YQigBqVQNW
— VishwakSen (@VishwakSenActor) January 12, 2025