జగన్ ను నమ్ముకుని గత ఐదేళ్లు అక్రమాలకు, అడ్డగోలు దోపిడీలకు పాల్పిడిన వారంతా ఒక్కొక్కరిగా జైలు పాలవుతున్నారు. ఈ జాబితాలో ఓ మహిళా డాక్టర్ కూడా చేరబోతోంది. ఉన్నత చదువులను అభ్యసించి వైద్యురాలిగా గుర్తింపు పొందిన గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ నీలం ప్రభావతి.. జగన్ లాంటి నీతి మాలిన రాజకీయ నాయకుడిని నమ్మి బలైపోయారు. తనను ఎదురించిన నరసాపురం మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కొట్టించి తన మానసిక కోరికను తీర్చుకున్న జగన్ వల్ల ఇప్పటికే ఎందరో చిక్కుల్లో పడ్డారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక తనను కొట్టిన వారికి శిక్ష పడాల్సిందే అని రఘురామ పట్టు మీద ఉండటంతో.. ఆయనపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో సీఐడీ పూర్వ చీఫ్ పి.వి. సునీల్ కుమార్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ పి. ఎస్. ఆర్ ఆంజనేయులు, సీఐడీ విశ్రాంత, ఏఎస్పీ విజయ్ పాల్, గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి నిందితులుగా ఉన్నారు. ఈ ప్రభావతి సీనియర్ వైద్యురాలు మరియు ఓ వైసీపీ నాయకుడి సతీమణి.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు ఆస్పత్రిపై పెత్తనం కావాలని ప్రభావతి కోరడంతో.. అందుకు జగన్ సరే అనేశారు. ఆ తర్వాత తెలివిగా ఆమెను వాడుకునే తప్పుడు పనులకు పాల్పడ్డారు. సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురైన రఘురామకృష్ణను కోర్టు వైద్య పరీక్షలకు పంపగా.. ప్రభావతి అసలు ఆయనకు గాయాలే లేవంటూ తప్పుడు నివేదిక ఇచ్చారు. జగన్ కోసం రిపోర్టులను ట్యాంపరింగ్ చేశారు.
అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు చేసిన సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు రఘురామను సీఐడీ పోలీసులు కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారని నిర్ధారించారు. దాంతో ప్రభావతి అడ్డంగా బుక్కైయ్యారు. తప్పుడు వైద్య నివేదిక అందజేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని రాఘురామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రభావతి హైకోర్టును ఆశ్రయించారు. కానీ ప్రభావతికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభావతి జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు.