వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ తన ఫొటోల, రంగుల పిచ్చతో నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. బడి పిల్లల ఫల్లీ చిక్కీ మొదలు…పొలం పట్టాదారు పాసు పుస్తకం వరకు అన్నింటి మీద తన ఫొటో ఉండాలన్నది జగన్ కల. ఇక, కనిపించిన చోటల్లా వైసీపీ రంగులు వేయడం…కోర్టు చివాట్లు పెట్టడం జగన్ పాలనలో పరిపాటిగా మారింది.
అది చాలదన్నట్లు ప్రభుత్వ పథకాలకు కుదిరితే తన పేరు..కుదరకపోతే తన తండ్రి పేరు పెట్టేసి క్రెడిట్ అంతా కొట్టేయడం జగన్ కు అలవాటు. అయితే, వైసీపీ పేరును పక్కకు నెట్టి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం క్రమక్రమంగా జగన్ పేరు పిచ్చిని తగ్గిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘జగనన్న కాలనీ’ల పేరును ఏపీ ప్రభుత్వం మార్చింది.
‘పీఎంఏవై (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) – ఎన్టీఆర్ నగర్’ గా ఆ కాలనీలకు చంద్రబాబు సర్కార్ కొత్త పేరు పెట్టింది. జగన్ హయాంలో ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పేరుతో జగనన్న కాలనీల కోసం భూములను కేటాయించారు. తాజాగా ఆ పేరు మారుస్తూ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇది శాంపిల్ అని, ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.