సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఈ రోజు పోలీసులు విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే. ఏసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ, సీఐల నేతృత్వంలోని బృందం…అల్లు అర్జున్ ను ఆయన లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ ముగిసింది. దాదాపు 3 గంటల పాటు విచారణ జరిపిన పోలీసులు 20కు పైగా ప్రశ్నల అడిగినట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని పోలీసులు అనుకున్నా..ఆ ఆలోచనను విరమించుకున్నారు.
ఇప్పుడు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ ను తీసుకువెళితే మరోసారి ఆయన అభిమానులు భారీగా చేరుకుంటే తొక్కిసలాట జరిగే చాన్స్ ఉన్న నేపథ్యంలో మరో రోజు సీన్ రీకన్ స్ట్రక్షన్ పెట్టుకోవాలని పోలీసులు భావించారని తెలుస్తోంది. అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఇక, అల్లు అర్జున్ ప్రధాన బౌన్సర్ ఆంటోనీని పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేశారని, ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. ఆంటోనీ వల్ల తొక్కిసలాట మొదలైందని తెలుస్తోంది. ఈ తొక్కిసలాట ఘటనలో ఆంటోనీ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
తొక్కిసలాట ఘటనతో పాటు అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై కూడా పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది. రేవతి చనిపోయిన విషయం మరుసటి రోజు తెలిసిందని అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తో పాటు అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.