సంధ్య థియేటర్ ఇష్యూ రోజు రోజుకు ముదురుతోంది. పుష్ప 2 సక్సెస్ అయ్యిందన్న సంతోషం కూడా బన్నీ కి మిగల్లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ కారణంగానే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి మరణించిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలన్నీ తప్పుడు ఆరోపణలంటూ ఇప్పటికే బన్నీ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు.
మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ కొందరు ప్రభుత్వ తీరును తప్పు పడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇటువంటి పోస్టులు బన్నీకి ప్లస్ అవ్వకపోగా ఆయనపై మరింత నెగిటివిటీని పెంచేస్తున్నాయి. పైగా వివాదాన్ని మరింత శృతిమించే స్థాయికి తీసుకెళ్లున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బన్నీ సోషల్ మీడియా వేదికగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
`నా ఫాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్ట్లు చేయవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రోజులుగా ఫేక్ ఐడి, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్ కు సూచిస్తున్నాను` అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు.
I appeal to all my fans to express their feelings responsibly, as always and not resort to any kind of abusive language or behavior both online and offline. #TeamAA pic.twitter.com/qIocw4uCfk
— Allu Arjun (@alluarjun) December 22, 2024