టీ.. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన పానీయాల్లో ఒకటి. సాధారణంగా కప్పు టీ ఖరీదు ఎంతుంటుంది.. ఏ పది రూపాయిలో, ఇరవై రూపాయిలో రోడ్ సైడ్ అయితే. అదే పెద్ద రెస్టారెంట్ లో వంద నుంచి రెండొందలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే టీ ఖరీదు అక్షరాల రూ. 1.14 లక్షలు. వినడానికి విచిత్రంగా ఉన్నా మీరు విన్నది నిజమే. అయితే ఇది మన దేశంలో కాదండోయ్.. దుబాయ్‌లో.
భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త సుచేతా శర్మ అనే వ్యక్తి దుబాయ్‌లో డిఐఎఫ్సి లోని ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్‌లో `బోహో కేఫ్ & రెస్టారెంట్` ను నడుపుతున్నారు. ఈ రెస్టారెంట్ హై-ఎండ్ మరియు సరసమైన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్లను అందిస్తోంది. ఇతర ప్రీమియం ఐటెమ్స్ లో గోల్డ్ సావనీర్ కారక్ చాయ్, గోల్డ్ సావనీర్ కాఫీ, గోల్డ్-డస్టెడ్ క్రోసెంట్స్, గోల్డ్ డ్రింక్స్ మరియు గోల్డ్ ఐస్ క్రీమ్ కూడా ఉన్నాయి.
అయితే వీటిలో ` గోల్డ్ కారక్ చాయ్ ` ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే, ఒక కప్పు గోల్డ్ కారక్ చాయ్‌ను రూ. 1.14 లక్షల (AED 5000) కు సదరు భారతీయ కేఫ్ విక్రయిస్తోంది. ఈ టీ స్పెషాలిటీ ఏంటంటే.. వెండితో తయారు చేసిన కప్పులో 24 క్యారెట్ బంగారం పూతతో టీని సర్వ్ చేస్తారు. టీ తో పాటుగా మీరు బంగారాన్ని తాగేయొచ్చు. అలాగే టీ తాగిన తర్వాత ఆ సిల్వర్ కప్పును మీరే తీసుకుని వెళ్లిపోవచ్చు. ఇదే కేఫ్ లో గోల్డ్ సావనీర్ కాఫీని రూ. 1.14 లక్షలకు అందిస్తున్నారు. రాచరిక అనుభవాన్ని కోరుకునే వారి కోసం బోహో కేఫ్ & రెస్టారెంట్ ఈ స్పెషల్ టీ మరియు కాఫీలను సర్వ్ చేస్తోంది.
View this post on Instagram