ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. జైల్లో చంద్రబాబును కలిసినప్పటి నుంచి నిన్న విజయవాడలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం వరకు ఈ బాండింగ్ కొనసాగుతూనే ఉంది. ఆ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు, పవన్ నవ్వుకుంటూ జరిపిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వేదికపై సరదాగా ముచ్చటించుకున్న ఈ ఇద్దరు నేతలు…నవ్వుతూ కనిపించారు. చంద్రబాబు చెవిలో పవన్ ఏదో చెప్పగా జాగ్రత్తగా విని చంద్రబాబు తిరిగి బదులిచ్చారు. ఆ తర్వాత పవన్ చేయి పట్టుకున్న చంద్రబాబు తిరిగి నవ్వుతూ పవన్ ను టచ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకోవడం..ఈ సరదా సన్నివేశం చూసి వేదికపై అందరూ చిరునవ్వులు చిందించడం వైరల్ గా మారింది.
ఆ తర్వాత చంద్రబాబు చేయి పట్టుకున్న పవన్.. మళ్లీ ఇంకేదో చెప్పడంతో చంద్రబాబు ఇంకోసారి చెవి దగ్గరగా పెట్టి విన్నారు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుని ముందుకెళ్లారు. అల్లు అర్జున్ అరెస్టు వార్తల్లో పడి ఇంత మంచి వీడియో మిస్సయ్యామేంటి అంటూ సోషల్ మీడియా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Ee AA gola lo padi intha beautiful video ni miss ayyam 😍@PawanKalyan 🤝 @ncbnpic.twitter.com/7dDYtSXHNK
— Monkey D.Luffy 🥋 (@gnani0414) December 13, 2024