పులివెందుల ఎమ్మెల్యే పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ప్రతిష్ఠ ను, తిరుపతి లడ్డూ విశిష్టతను జగన్ దెబ్బతీశారని, తిరుమల ఆలయాన్ని ఆదాయ వనరుగా చూశారని పవన్ ఆరోపించారు. ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉన్నట్లుగా హిందువులకు ఉమ్మడిగా ఓ సనాతన బోర్డు ఉంటే బాగుంటుందని పవన్ అన్నారు. ఆలయాలు హిందువుల పర్యవేక్షణలో ఉండాలని, మక్కాలో ముస్లింలు అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తారని గుర్తు చేశఆరు.
ఆలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలని పవన్ ఆకాంక్షించారు. ఆలయాలు ఆదాయ వనరులు కావని అన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ వంటి వ్యవహారం వేరే మతాల్లో జరిగితే వారు రోడ్లమీదకు వస్తారని, హిందువులు మాత్రం ఆ స్థాయిలో రావడం లేదని బాధపడ్డారు. తన మతాన్ని ఆచరిస్తూ వేరే మతాలను గౌరవిస్తానని పవన్ చెప్పారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఇస్కాన్ మాజీ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు సరైన నిర్ణయం కాదని అన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పాలస్తీనా అంశంపై అందరూ మాట్లాడతారని, బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల గురించి అందరూ స్పందించట్లేదని పవన్ చెప్పారు.