నాగర్జున వారసులిద్దరూ ఒకేసారి పెళ్లికి సిద్ధం కావడంతో అక్కినేని వారింట పండుగ వాతావరణం నెలకొంది. కొన్ని నెలల క్రితమే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది. డిసెంబర్ మొదటి వారంలో చైతు – శోభిత వివాహ వేడుకను నిర్వహించబోతున్నారు. ఇంతలోనే నాగార్జున మరో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. తన చిన్న కుమారుడు కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడని.. చిత్రకారిణి జైనాబ్ రవ్జీతో అఖిల్ కు నిశ్చితార్థం జరిగిందని తెలుపుతూ నాగార్జున కొన్ని ఫోటోలు పంచుకున్నారు.
రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న అఖిల్, జైనాబ్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. 2025 సమ్మర్ లో వీరి వెడ్డింగ్ ఉండొచ్చని అంటున్నారు. అయితే చైతు, అఖిల్ ఒకేసారి పెళ్లికి రెడీ అయ్యారని సంబరపడేలోపే అక్కినేని అమల చేసిన పనికి నాగ చైతన్య అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అసలేం జరిగిందంటే.. అఖిల్, జైనబ్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని అమల కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
`అక్కినేని అఖిల్‌కి జైనాబ్ రావ్జీతో నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించినందుకు నేను మరియు నాగార్జున చాలా సంతోషిస్తున్నాము! జైనాబ్‌ని మా కుటుంబంలోకి స్వాగతించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ యువ జంట జీవితకాలం ప్రేమ, ఆనందం మరియు మీ లెక్కలేనన్ని ఆశీర్వాదాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను` అంటూ అఖిల్, కాబోయే కోడలి ఫోటోను అమల ఇన్‌స్టా ద్వారా పంచుకుంది.
కానీ నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ సమయంలో మాత్రం అమల ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో రచ్చ మొదలైంది. సొంత కొడుకు ఎంగేజ్మెంట్ పై పోస్ట్ పెట్టిన అమల.. సవతి కొడుకు చైతు పట్ల ఎందుకంత వివక్షత చూపుతున్నారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు అఖిల్, జైనాబ్లకు అందరి ఆశీస్సులు కావాలని కోరిన అమల.. ఆనాడు చైతు, శోభితల కోసం ఎందుకు పోస్ట్ పెట్టలేదని మండిపడుతున్నారు.