వైసీపీ పాలనలో విశాఖలో రుషికొండరై 500 కోట్ల రూపాయం ప్రజాధనాన్ని వృథా చేసి ప్యాలెస్ నిర్మించిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి తూట్లు పొడుస్తూ , కోర్టు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోకుండా జగన్ ఆ బిల్డింగులను పూర్తి చేసిన వైనంపై విమర్శలు వచ్చాయి. ఇక, 2024 ఎన్నికల్లో జగన్ గెలిచి ఉంటే అక్కడి నుంచే పాలన సాగించేవారు. కానీ, ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ ప్యాలెస్ లోకి ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఒక సీఎం తన విలాసాల కోసం పర్యావరణాన్ని ధ్వంసం చేసి వందల కోట్లు ఖర్చుపెట్టి ప్యాలెస్ కట్టుకోవడం చరిత్రలో తొలిసారి అని విమర్శించారు. రుషికొండ భవనాల్లోకి వెళ్లే కొద్దీ గుండె చెదిరిపోయి వాస్తవాలు వెల్లడవుతున్నాయని చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మభ్య పెట్టి రుషికొండ కట్టారని విమర్శించారు. తనను, పవన్ కళ్యాణ్ ను రుషికొండకు రానియ్యకుండా గతంలో అడ్డుకున్నారని అన్నారు.
రాజుల కాలంలో చక్రవర్తులు కూడా ఈ తరహా భవనాలు నిర్మించుకోలేదని, బాత్ రూమ్ కోసం 36 లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఆశ్చర్యపోయారు. జగన్ ఏమైనా రారాజు అనుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఈ భవనాలు చూసేందుకు ప్రజలను అనుమతిస్తామని చెప్పారు. ఢిల్లీ నుంచి పెద్దలు వచ్చిన విశాఖలో నేవీ గెస్ట్ హౌస్ లో గుర్తు చేశారు. ఇటువంటి ఖరీదైన ప్రభుత్వ భవనాలను ఎక్కడా చూడలేదని, వైట్ హౌస్, రాష్ట్రపతి భవన్ లో కూడా ఈ సౌకర్యాలు లేవని ఆశ్చర్యపోయారు.