ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి నారా లోకేష్ అమెరికా టూర్ దిగ్విజయంగా ముగిసింది. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా వారం రోజుల పాటు లోకేష్ అమెరికాలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024 లో పాల్గొన్న లోకేష్ పలు దిగ్గజ సంస్థల సీఈవోలతో భేటీ అయ్యి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఓవరాల్ గా అమెరికా పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యి పెట్టుబడులకు ఆహ్వానం పలికారు.
ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. దాంతోపాటు చంద్రబాబు విజన్ ను వివరించడంలో లోకేష్ విజయవంతమయ్యారు. బ్రాండ్ ఏపీ లక్ష్యంగా సాగిన లోకేష్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. లోకేష్ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. జనవరిలో దావోస్ లో జరిగే పెట్టుబడుల సదస్సులో పలు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం భారీగా ఎంవోయూలు చేసుకునే అవకాశముంది. లోకేష్ పర్యటన విజయవంతం కావడంపై ఏపీ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 5 సంవత్సరాల అరాచక పాలనలో శిథిలావస్థకు చేరిన ఏపీ పారిశ్రామిక రంగానికి లోకేష్ ఊపిరిపోశారని అంటున్నాయి.
లోకేష్ తన పర్యటనలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, ఎన్ విడియా, యాపిల్, గూగుల్ క్లౌడ్, పెరోట్ గ్రూప్, రేవేచర్, సేల్స్ ఫోర్స్, ఫాల్కన్ ఎక్స్, ఈక్వెనెక్స్, జడ్ స్కాలర్ తదితర కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అక్టోబర్ 29న లాస్ వేగాస్ లో జరిగిన ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ – 2024 లో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. 23 దేశాల నుంచి 2300 చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియాస్పోరా ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో చదవడం, ప్రపంచబ్యాంకులో పనిచేసిన అనుభవం ఉపయోగించిన లోకేష్ ఏపీలో డిజిటల్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలను వివరించడంలో సక్సెస్ అయ్యారు. గత అయిదేళ్లుగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ పై పారిశ్రామికవేత్తలలో ఉన్న దురభిప్రాయాన్ని తొలగించి నమ్మకం కలిగించడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు.