తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్.. తాజాగా తన మనసులోని మాటలను నెటిజన్లతో పంచుకున్నారు. త్వర లోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు రెడీ అవుతున్నట్టు ఆయన చెప్పారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు.. రాష్ట్రంలో పర్యటిం చాలని కోరుతున్నారని, అయితే అది కారులోనో.. హెలికాప్టర్లోనో కాదని.. పాదయాత్ర చేయాలని కోరుతు న్నారని ఆయన తెలిపారు. వారి అభిప్రాయాల మేరకు.. తాను పాదయాత్రకు రెడీ అవుతున్నట్టు చెప్పారు.
పాదయాత్రకు సంబంధించి.. ఫిజీషియన్స్ సలహాలు తీసుకుంటానన్నారు. ఇక, ప్రస్తుతం బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలను అనేక విధాల వేధిస్తున్న పోలీసులు సహా ఇతర అధికారుల పేర్లను రాసుకుంటు న్నట్టు పరోక్షంగా ఆయన రెడ్ బుక్ ప్రస్తావన తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరి పేర్లనూ గుర్తు పెట్టుకుంటు న్నట్టు చెప్పారు. బీఆర్ ఎస్ నాయకులను వేధిస్తున్న పోలీసులకు తగిన విధంగా `ప్రమోషన్లు` ఉంటాయని అధికారం ఎప్పుడూ.. ఒక్కరికే అధికారం శాస్వతం కాదని హెచ్చరించారు.
“విధులు మరిచి, చట్ట విరుద్ధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపైన రెచ్చిపోతున్న పోలీస్ అధికారులను గుర్తుపెట్టుకుంటా“ అని కేటీఆర్ చెప్పారు. ఇక, సోషల్ మీడియాలో బీఆర్ ఎస్ నాయకులు చాలా యాక్టివ్గా ముందుకు సాగుతున్నారని కేటీఆర్ చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. అంతా బాగానే ఉంటుందని. కానీ, పార్టీ ఓటమి తర్వాత కూడా.. కేసీఆర్ కోసం.. నిలబడుతున్న వారిని చూస్తే.. తనకు ఆశ్చర్యం వేస్తోందన్నారు.
అవి జుమ్లా ఎన్నికలు!
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలను కేటీఆర్ వ్యతిరేకించారు. అవి జమిలి ఎన్నికలు కావని.. జుమ్లా ఎన్నికలని అన్నారు. “ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో బిజెపి మరొక జుమ్లా చేస్తోంది“ అని ఫైరయ్యారు. తాము ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనేది కేసీఆర్ ఆలోచించి చెబుతారన్నారు. అయితే.. కేంద్రం తెచ్చే చట్టం ఎలా ఉంటుందో ముందు చూడాల్సి ఉంటుందన్నారు. జమిలి ఎన్నికలు ఈ దేశంలో సాధ్యం కాదన్నది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.