తన సోదరి షర్మిలకు ఆస్తి పంపకాల వ్యవహారంలో జగన్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిలకు జగన్ గతంలో రాసిన లేఖ సంచలనం రేపుతోంది. తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలాగా వ్యవహరించిన షర్మిలపై ప్రేమాప్యాయతలు పోయాయని ఆగస్టు 27వ తేదీన షర్మిలకు జగన్ రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, షర్మిల ఆలోచన, ప్రవర్తన మారితే ఆ ఆస్తులను పునరుద్ధరిస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాత భవిష్యత్తులో ఆ ఆస్తులు షర్మిలకు చెందేలా గతంలో ఒప్పందం చేశానని జగన్ చెప్పారు. అలాకాకుండా నేరుగా తన తల్లి విజయమ్మ ద్వారా పదేళ్ల కాలంలో షర్మిలకు 200 కోట్లు ఇచ్చానని జగన్ వెల్లడించారు. కనీసం ఆ కృతజ్ఞత లేకుండా షర్మిల తనపై రాజకీయంగా విమర్శలు చేస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శ్రేయస్సు గురించి షర్మిల ఆలోచించకపోవడాన్ని ఆమె విచక్షణకే వదిలేస్తున్నానని జగన్ అన్నారు.
షర్మిల ప్రవర్తనలో మార్పులు వస్తే కోర్టు కేసులన్నీ పరిష్కారం అయ్యాక ఆస్తులకు సంబంధించి ఏం చేయాలి అన్న విషయం ప పునరాలోచిస్తానని అన్నారు. తనకు, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భారతికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని జగన్ కండిషన్ పెట్టారు. రాజకీయంగా తనకు వ్యతిరేకంగా ఉండవద్దని షర్మిలకు జగన్ వేరే లేఖ ఒకటి రాసినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా అవినాష్ రెడ్డిని విమర్శించిన షర్మిలను మందలించిన జగన్ పై ట్రోలింగ్ జరుగుతుంది.