అందాల తార నదియా బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా నదియా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నదియా అసలు పేరు జరీనా మొయిదు. 1966 అక్టోబర్ 24న ముంబైలోని ఒక మలయాళ కుటుంబంలో ఆమె జన్మించింది. నదియా బాల్యం, విద్యాభ్యాసం ముంబైలోనే సాగాయి. 1984లో `నొక్కేత దూరతు కన్నుమ్ నట్టు` అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా నదియా తన సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకుంది.
ఆ తర్వాత మలయాళం, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నదియా.. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఇండస్ట్రీకి దూరమైంది. 1988లో శిరీష్ గాడ్బోలేను నదియా వివాహం చేసుకుంది. శిరీష్ అమెరికాలో వర్క్ చేసేవారు. అందువల్ల నదియా సినిమాలకు బ్రేక్ ఇచ్చి భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. యునైటెడ్ స్టేట్స్ లో నివసిస్తూ సనమ్ మరియు జానా అనే ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది.
అలాగే మరోవైపు మీడియా మేనేజ్మెంట్లో అసోసియేట్ డిగ్రీని కూడా నందియా కంప్లీట్ చేశారు. 2000 నుండి 2007 వరకు నదియా ఫ్యామిలీ లండన్ లో ఉన్నాడు. 2008లో ఇండియాకు వచ్చి ముంబైలో సెటిల్ అయ్యారు. ఇక 2004లో `M. కుమరన్ S/O మహాలక్ష్మి` అనే తమిళ చిత్రంతో సహాయక నటిగా నదియా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తెలుగులో మిర్చి మూవీతో ఆమె కంబ్యాక్ ఇచ్చారు.
అత్తారింటికి దారేది మూవీతో క్లాస్, మాస్ ఆడియన్స్ అని తేడా లేకుండా తెలుగు వాళ్లందరికీ నదియా ఎంతగానో దగ్గరయ్యారు. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండిస్ట్రీలో సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక అందం, ఆహార్యంలో నేటి తరం హీరోయిన్లతో పోటీ పడుతున్న నదియా.. రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఛార్జ్ చేస్తారు. నదియా ఒక్క రోజు రెమ్యునరేషన్ రూ. 2 నుంచి 3 లక్షల రేంజ్ లో ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ ఉంది.