ఇటీవల విజయవాడను భారీ వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ప్రజలకు భారీగా అస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయవాడ వరద బాధితుల సహాయార్థం టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు కూడా ఏపీ సీఎం ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి కోటి రూపాయల విరాళం చెక్కును స్వయంగా అందించారు.
ఈ క్రమంలోనే చిరంజీవిపై చంద్రబాబు ప్రశంసలు కురిపించగా తాజాగా చంద్రబాబు నాయకత్వాన్ని చిరంజీవి ప్రశంసించారు. విపత్తులు వచ్చినప్పుడు తమ వంతు సాయం అందించడం తమ కర్తవ్యం అని చిరంజీవి అన్నారు. తనపై చంద్రబాబు చూపిన అభిమానానికి చిరు ధన్యవాదాలు చెప్పారు. వరదలు వంటి విపత్తులు వచ్చినప్పుడు మన సొంత మనుషులకు సహాయం చేయడం మన కర్తవ్యం అని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వం ఎంతో ఆదర్శనీయమని కొనియాయాడారు. ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితుల సహాయార్థం చిరంజీవి 50 లక్షల రూపాయలు, రామ్ చరణ్ తేజ్ 50 లక్షల రూపాయలు మొత్తం కోటి రూపాయలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.