పోలవరం ఎవరికి ఉపయోగపడాలి.
ప్రజలకు కదా !
మరి ఎవరికి ఉపయోగపడతుంది
రెడ్డి గార్ల ఖజానా నింపడానికి !
అది ఎలాగో ఇపుడు చూద్దాం.
ప్రతిష్టాత్మక పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టును వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే పూర్తి చేస్తామని గొప్పలు చెబుతున్న సర్కారు.. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఇసుక పంపిణీ విషయంలో దొంగాట ఆడుతోందనే విమర్శలు వస్తున్నాయి.
గతంలో చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు పనులు జరిగినప్పుడు.. ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని అనుసరించి.. ప్రాజెక్టుకు అవసరమైన.. ఇసుకను ఎంత కావాలన్నా.. ముందుగానే ఇచ్చారు. అసలు ప్రాజెక్టు దగ్గరే ఇసుక ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా ప్రాజెక్టుకు ఆ ఇసుక వాడుకుంటారు. దానికి డబ్బులు ఎందుక కట్టాలి అన్నది చంద్రబాబు ఆలోచనగా ఉండేది. దీంతో ప్రాజెక్టు పనులు వడివడిగా ముందుకు సాగాయి.
కానీ, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇసుక విషయంలో `తైలం` పిండుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కప్పం కట్టాల్సిందేనని.. ఏదీ ఉచితంగా రాదని.. కాంట్రాక్టర్లకు మొహం మీదే చెప్పేస్తోంది. వాస్తవానికి ప్రజాప్రయోజనంతోపాటు.. రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కారు అనుసరిస్తున్న తీరు తీవ్ర వివాదంగా మారింది.
జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఇసుక కష్టాలు అన్నీ ఇన్నీ కావనే విషయం తెలిసిందే. అక్రమ ఇసుక మాఫియా రాష్ట్రంలో చెలరేగిపోయింది. ఉచిత ఇసుక విధానాన్ని ఒక్క కలం పోటుతో సీఎం రద్దు చేశారు.
అంతేకాదు.. నూతన విధానం అంటూ.. ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ రీచ్ లనుంచి మంత్రులే దోచుకునేందుకు అవకాశం కల్పించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా.. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైనా పట్టించుకోలేదు.
దీంతో తొలి ఏడాదిలో అనేక మంది కార్మికులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఇదే విధానం కొనసాగుతోంది. అందునా.. అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సరఫరా చేసే ఇసుకలో కూడా కప్పం వెతుక్కుంటూ.. జాప్యం చేస్తుండడంతో ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందోననే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి.