తనను జైలు పక్షి అంటున్నారని, తెలుగుదేశం నేతలు అందరినీ ఒకసారి జైలుకు పంపిస్తే ఇకపై తనను జైలు పక్షి అనలేరని జగన్ ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.
కరోనా బారిన పడిన ప్రజలకు బెడ్లు, ఆక్సిజన్, శ్మశానంలో చోటు సమకూర్చలేని ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి తన పగ ప్రతీకారాల కోసం పోలీసు వ్యవస్థను నాశనం పట్టిస్తున్నాడని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.
తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముందస్తు నోటీసులు లేకుండా, ఉన్నపళంగా వందల మంది పోలీసులు ఇంటికి వెళ్ళి అరాచకం సృష్టిస్తారా? సంగం డైరీని ఎవరికోసం నాశనం చేయాలని చూస్తున్నారు? నరేంద్రను వెంటనే విడుదల చేయాలి. pic.twitter.com/c85qFvH2D6
— N Chandrababu Naidu (@ncbn) April 23, 2021
5సార్లుశాసనసభ్యుడిగా చేసిన తెదేపానేత ధూళిపాళ నరేంద్ర అక్రమఅరెస్టును తీవ్రంగాఖండిస్తున్నా..కరోనావిలయతాండవం చేస్తున్నవేళ బాధితులు బెడ్ ఇప్పించమని వేడుకుంటుంటే పట్టించుకోనిప్రభుత్వం తేదేపానేతలపై కక్షసాధింపుచర్యలకు దిగుతూ, వందలమందిపోలీసులతో అక్రమంగా అరెస్టుచేయడం ప్రభుత్వదుర్మార్గచర్య pic.twitter.com/WypdWKXE2w
— Devineni Uma (@DevineniUma) April 23, 2021
నరేంద్ర ( @DhulipallaNk ) గారి పై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయడం దుర్మార్గం.. @YSRCParty ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నేతలు లక్ష్యంగా అక్రమ అరెస్టులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి.
#WeStandWithDhulipalla pic.twitter.com/2R7qganOkk
— Yeluri SambasivaRao (@SambaYeluri) April 23, 2021
ధూళిపాళ్ల.నరేంద్ర గారి అక్రమఅరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్న.కక్ష్యపూరితం గానే ycp govt నరేంద్రని అరెస్ట్ చేశారు.సంఘం డైరీ లో ఏమైనా లోపాలు ఉంటే నోటీసులు ఇవ్వాలి.Covid టైమ్ లో అంతమంది పోలీసులు వెళ్లి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేయటం సబబా?ఇలాంటి కక్ష్య సాధింపుచర్యలు మానుకోవాలి
— Peethala Sujatha (@SujathaPeethala) April 23, 2021