ప్రపంచానిది ఒక బాధ. జగన్ ది ఒక బాధ.
రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పనులన్నీ వదిలేసి వకీల్ సాబ్ కి డబ్బులు రాకుండా చేయడం, తెలుగుదేశం నేతలనుఅరెస్టు చేయడమే పనిగా పెట్టుకున్నారు.
ఈ ఉదయం తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారు. దీనికోసం వంద మంది పోలీసులను రంగంలోకి దింపారు.
అసలు అంతమంది పోలీసులను రంగంలోకి దింపడంతోనే అది అక్రమ అరెస్టు అని అర్థమవుతుందని తెలుగుదేశం నేతలు విమర్శించారు.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉండే ధూళిపాళ్ల నరేంద్ర సొంతూరు చింతలపూడిలో ఆయనను అరెస్టు చేశారు. ధూళిపాళ్ల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ముందస్తు నోటీసు లేకుండా ఐదు గంటల వేళలో దాదాపు వందకు పైగా పోలీసులు ధూళిపాళ్ల నివాసాన్ని చుట్టుముట్టారు. ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు చేశారు.
ఇంతకీ విషయం ఏమిటంటే సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయన్నది ఆరోపణ. ఆ ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు కావటం గమనార్హం.
సీఆర్ పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి కూడా నోటీసులు జారీ చేశారు. నరేంద్రకునోటీసులు ఇచ్చిన సందర్భంలో అతడిపై మోపిన అభియోగాలు నాన్ బెయిల్ బుల్ గా పేర్కొన్నారు.
సంగం డెయిరీకి సంబంధించిన కేసులోనే నరేంద్రను అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.
తాజా పరిణామం విపక్ష టీడీపీని కుదిపేసింది. నరేంద్ర స్వగ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా.. పోలీసులు భారీగా మొహరించారు.
ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో రాక్షస ఆనందం పొందుతున్నారు @ysjagan. ధూళిపాళ్ల కుటుంబం నలుగురికి సాయం చేసే చరిత్ర ఉన్న కుటుంబం. మీలాంటి దోపిడీ కుటుంబం కాదు.(1/4) pic.twitter.com/fTQMOQLHwr
— Lokesh Nara (@naralokesh) April 23, 2021