బే ఏరియా లో పెద్దన్న గా పిలువబడే ‘రమేష్ తంగళ్లపల్లి’ 70 వ పుట్టిన రోజు మరియు వారి సతీమణి ‘రమ తంగళ్లపల్లి’ 60 వ పుట్టిన రోజు వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి వచ్చిన ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు ‘రమేష్’ మంచి మనసు గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన దయాగుణం గురించి ఎన్నో ఉదాహరణలు గొప్పగా చెప్పి ప్రశంసలు కురిపించారు.
సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి శ్రీనివాస మానప్రగడ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
చివరిగా ‘రమేష్ తంగళ్లపల్లి’ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి హాజరైన బంధు మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
రమేష్ తంగళ్లపల్లి 100 వ పుట్టిన రోజు ఈ బంధు మిత్రుల సమక్షంలోనే జరుపుకోవాలని ‘నమస్తే ఆంధ్ర’ ఆకాంక్షిస్తోంది.