టాలీవుడ్ లో గోపీచంద్ ను హీరోగా నిలబెట్టిన చిత్రం `యజ్ఞం`. ఈతరం ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి ఏఎస్ రవి కుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో రూపుదిద్దుకున్న లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో మూన్ బెనర్జీ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, దేవరాజ్, విజయ రంగరాజు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. మణి శర్మ సంగీతం అందించారు.
2004లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన యజ్ఞం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అటు యూత్ తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, మాస్ ప్రేక్షకులకు కూడా సినిమా అద్భుతంగా మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 9 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ ను రాబట్టింది. యజ్ఞం తర్వాత హీరోగా గోపీచంద్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా శైలు పాత్రలో అలరించిన అందాల భామ మూన్ బెనర్జీ గుర్తుందా..? తెలుగులో ఆమె చేసింది ఒక్క సినిమానే అయినా.. తనదైన అందం, అభినయంతో, చిలిపితనంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసింది.
కోల్‌కతాకు చెందిన మూన్‌మూన్ బెనర్జీ.. 1997లో హిందీ టెలివిజన్ పై అడుగుపెట్టి సీరియల్స్, టీవీ షోలు చేస్తూ గుర్తింపు పొందింది. ఆ సమయంలోనే యజ్ఞంలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఈ చిత్రం విజయవంతమైనప్పటికీ.. మూన్ బెనర్జీ మాత్రం ఆ తర్వాత వెండితెరపై పెద్దగా కనిపించలేదు. స్మాల్ స్క్రీన్ పై బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూ కెరీర్ ను కొనసాగించింది. ఇప్పటికీ సీరియల్స్ లో కంటిన్యూ అవుతోంది.
అయితే మూన్ బెనర్జీ ఇప్పుడెలా ఉందో చూస్తే ఖచ్చితంగా షాకైపోతారు. ఎందుకంటే అస్సలు గుర్తుపట్టలేనంతంగా ఆమె మారిపోయింది. వయసు పెరగడంతో బొద్దుగా మారింది. గ్లామర్ కూడా తగ్గిందనే చెప్పొచ్చు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటే మూన్ బెనర్జీ.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. కాగా, మూన్ బెనర్జీ మొదట గౌతమ్ జోగ్లేకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే వీరి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. గౌతమ్ తో విడాకులు తీసుకున్న అనంతరం మూన్ బెనర్జీ.. 2010లో నిర్మాత నీరజ్ శర్మను రెండో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రుమీర్ శర్మ అనే కుమారుడు ఉన్నాడు.
View this post on Instagram