తీవ్రమైన ఆరోపణలతో నాలుగు రోజుల నుంచి మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక గా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా పని చేస్తున్న బాధితురాలు మూడు నాలుగు రోజుల క్రితం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం తెలిసిందే. అనంతరం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
అయితే.. జానీ మాస్టర్ మీద ఇప్పటికే బోలెడన్ని ఆరోపణలు రావటం.. తాజాగా ఆయనపై వచ్చిన ఆరోపణ తీవ్రత ఎక్కువగా ఉంది. తనను మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగిక దాడికి పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో జానీ మాస్టర్ మీద పోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దీనికి తోడు జానీ మాస్టర్ మీద వస్తున్న ఆరోపణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
ఫిర్యాదు ఇచ్చిన నాటి నుంచి నగరంలో శేఖర్ బాషా కనిపించకుండా పోయారు. తన మీద ఆరోపణలు వచ్చిన నాటి నుంచి అతను అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. దీంతో ఆయన ఎక్కడ? అన్నది ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడ ఉన్నారు? అన్నది ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉన్నట్లుగా వార్తలు.. వాట్సాప్ మెసేజ్ లు వచ్చాయి.
అయితే.. తాజాగా అతన్ను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జానీ మాస్టర్ కదలికల్ని పసిగట్టిన హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక టీం బెంగళూరుకు వెళ్లారు. తాజాగా అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా నగరానికి తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారని చెబుతున్నారు. పోలీసుల విచారణలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.