మొట్ట మొదటిసారిగా, ‘తానా’ మిడ్–అట్లాంటిక్ మహిళల బృందం సెప్టెంబర్ 14, 2024న ఫిలడెల్ఫియాలో లేడీస్ నైట్ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 400 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.
ఇందులో నాన్‌స్టాప్ సరదా మరియు మహిళలను ఉత్సాహపరిచే ఎన్నోవేడుకలు ఉన్నాయి.
ప్రముఖ యాంకర్ సుమ, ముఖ్య అతిథిగా పాల్గొని, లేడీస్ నైట్ ఈవెంట్ కోసం ఎనర్జిటిక్ టోన్ సెట్ చేయగా, ప్రత్యేక అతిథిగా వచ్చిన మిర్చి భార్గవి తన ఆకర్షణీయమైన హోస్టింగ్‌తో అందరిని ఆకొట్టుకొంది.
హాజరైనవారు ఆటలు, రుచికరమైన విందు మరియు పసందైన సంగీతం తో సహా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించారు.
మహిళా కమిటీ చైర్ సరోజా పావులూరి నేతృత్వంలో ‘తానా’ మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం లోని సభ్యులు రాజేశ్వరి కొడాలి, భవాని కొత్తపల్లి, మనీషా మేక, సునీత వాగ్వాల, మైత్రి నుక్కాల, నీలిమ వోలేటి, రమ్య మాలెంపాటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, దీప్తి కోక, బిందు లంక, సౌజన్య కోగంటి, సలేహా కిల్లేధర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కోసం అవిశ్రాంతంగా పనిచేసారు
ఆర్గనైజింగ్ కమిటీ అంకితభావం, నిబద్ధత మరియు కృషిని హాజరైన వారందరూ అభినందించారు.
‘తానా’ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలు సాధించిన విజయాలకు అభినందనలు తెలిపారు
2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో జరగనున్న 24వ ‘తానా’ సదస్సును కూడా ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ‘తానా’ బోర్డు సెక్రటరీ లక్ష్మీ దేవినేని, కళావేదిక అధ్యక్షురాలు స్వాతి అట్లూరి, వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి తదితరులు ప్రసంగించారు.
ఫిలడెల్ఫియా ‘తానా’ మహిళా జట్టు అమూల్యమైన తెరవెనుక మద్దతు ఇచ్చిన ఫణి కంతేటి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచిలి, కోటి యాగంటి, కృష్ణ నందమూరి, ప్రసాద్ కొత్తపల్లి, శ్రీకాంత్ గూడూరు, చలం పావులూరి, లక్ష్మణ్ బెల్లం, వెంకట్ సుబ్బారావు ముప్పా, నాయుడమ్మ యలవర్తి, మోహన్ మల్ల మరియు నాగరాజు చింతం తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.