వైసీపీ చేసిన పాపాలు .. మనకు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకృతి పగబట్టింద ని.. దీంతోనే వరదలు వస్తున్నాయని, ఒక్కొక్కసారి క్లౌడ్ బరస్ట్ జరిగి కూడా.. అనర్థాలు జరుగుతున్నాయ ని తెలిపారు. అయితే.. ఇలాంటివి జరిగినప్పుడు.. కాలువలు.. డ్రైన్లు సరిగా ఉంటే.. వాటి నుంచి తప్పిం చుకునే అవకాశం ఉంటుందన్నారు. కానీ, గత వైసీపీ పాలకులకు ఒక్క డ్రైన్‌ను కూడా తవ్వకుండా.. ఒక్క కాలువను కూడా తీయకుండా.. బిల్లులు పెట్టి ప్రజల సొమ్ము తినేశారని చెప్పారు.
ఇదే శాపంగా మారి.. వరదలు, వర్షాలతో ప్రజలు అల్లాడే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై సమీక్షించారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐదు సంవత్సరాల దుర్మార్గపు పరిపాలన, ఐదేళ్ల దుర్మార్గుడి పరిపాలన కారణంగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయని తెలిపారు. దీంతో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలే నష్టపోతారని.. ఇప్పుడు అదే జరిగిందని చెప్పారు.
ఐదు రోజుల పాటు బుడమేరకు వరద వస్తే.. తొలి రెండు రోజులు తాను అక్కడే ఉండి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చిందన్నారు. మంత్రి రామానాయుడు అక్కడే ఉండి గండ్లను పూడ్చాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. గండ్లు పూడ్చారు కాబట్టే విజయవాడకు వచ్చే వరదను నియంత్రించే పరిస్థితి వచ్చిందన్నారు. మొదట్లో బుడమేరును నియంత్రించడం సాధ్యం కాదనుకున్నామని.. అయితే.. యుద్ధం చేసి మరీ దీనిని నిలువరించామని చంద్రబాబు చెప్పారు.
గత పాలకులు కరకట్టను పటిష్టం చేసి ఉంటే.. గండ్లు పడేవి కావన్నారు. ఆక్రమణలు చేయకుండా ఉంటే.. అసలు గండ్లే పడి ఉండేవి కావని చెప్పారు. అయినా.. ఎవరూ పట్టించుకోలేదని.. ప్రజల సొమ్మును తినేశారని అన్నారు. ప్రజల కోసం.. తాము నిరంతరం పనిచేస్తూ.. బుడమేరులో రాళ్లు వేసి గండ్లు పూడ్చే ప్రయత్నం చేస్తే… ప్రతిపక్షంలో కూర్చుని మాపై రాళ్లు వేశారని.. వైసీపీ పై విమర్శల వర్షం కురిపించారు.