సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయం చేసేందుకు.. బాధితులను ఒడ్డుకు చేర్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నా.. వైసీపీ పేటీఎం బ్యాచ్‌కు కనిపించడం లేదని.. ఏపీ హోం మంత్రి వంగ లపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఎక్కడో కూర్చున్న జగన్.. పులిహార కబర్లు చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఆదివారం వరద వచ్చిన నాటి నుంచి సీఎం చంద్రబాబు.. ఇతర మంత్రులు అందరూ కూడా ప్రజల మద్యే ఉన్నారని.. నిరంతరం సేవలు అందిస్తున్నారని చెప్పా రు. అయినప్పటికీ వైసీపీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
తాజాగా విజయవాడలో అనిత మీడియాతో మాట్లాడారు. శనివారం రాత్రి వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ పై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బెంగళూరులో కూర్చుని తన పేటీఎం బ్యాచ్‌ను సర్కారుపైకి ఉసికొల్పారని దుయ్యబట్టారు. బెంగళూరులో కూర్చున్న జగన్.. పులిహోర కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రులు నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్న విషయం ఆయనకు తెలియకపోతే.. తెలుసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు సహా.. ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.
కాగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నట్టు మంత్రి అనిత తెలిపా రు. విజయవాడలో ఇంకా వరద ప్రభావం తగ్గలేదన్నారు. దీంతో బాధితులకు టిఫిన్, సహా భోజనాలు అం దిస్తున్నట్టు తెలిపారు. ముంపు కాలనీల్లో తమ ప్రభుత్వం చేస్తున్న సాయంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. “చేతనైతే.. వైసీపీ వాళ్లు కూడా వచ్చి సాయం చేయాలి. లేకపోతే.. చేస్తున్న దానిని ప్రశంసించాలి. అది చేతకాకపోతే.. మౌనంగా ఉండాలి. కానీ, ఇలా లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదు“ అని మంత్రి వ్యాఖ్యానించారు.