గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి…రెండు దశాబ్దాల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టిన అంబటి రాంబాబుకు అప్పుడే వ్యతిరేకత పెరుగుతోంది.
“మా ఎమ్మెల్యే మాటలకు ఎక్కువ.. పనికి తక్కువ“ అని ఇక్కడి ప్రజలు తెగ చర్చించేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై విజయం సాధించిన అంబటి.. పార్టీ మౌత్ పీస్‌గా ప్రతిపక్షంపై విమర్శలు చేస్తుంటారు. అదే సయమంలో వర్తమాన రాజకీయాలపై వ్యాఖ్యలు సంధిస్తారు. కానీ, రెండేళ్లయినా.. సత్తెనపల్లి నియోజకవర్గంలో అభివృద్ది చేయడం లేదని.. ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో సత్తెనపల్లిలో ఇంఇంటికీ తాగు నీరు అందిస్తామని.. డంపింగ్ యార్డ్ నిర్మాణం చేస్తామని.. వెనుకబడి న గ్రామాలను అభివృద్ధి చేస్తామని.. సమస్యలను పరిష్కరిస్తామని.. అంబటి హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఇంటింటికీ మరుగు దొడ్డి నిర్మాణం కూడా చేస్తామన్నారు.
మరీ ముఖ్యంగా గతంలో కోడెల హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని.. దాని అంతు చూస్తామని కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటికి రెండేళ్లయినా.. ఈ విషయాల్లో ఒక్కటి కూడా ఆయన సాధించలేదు.
పైగా గతంలో ఏ అవినీతి పేరిట ఆయన కోడెలపై యుద్ధం ప్రకటించారో.. ఇప్పుడు అవే మరకలు అంబటిని అంటున్నాయి.
మరీ ముఖ్యంగా.. మైనింగ్ కేసు ఇప్పుడు అంబటిని వెంటాడుతోంది. ఇటీవలే హైకోర్టు కూడా దీనిపై సీరియస్ అయింది. అక్రమై నింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. పెద్ద ఎత్తున సత్తెనపల్లిలో ధర్నాకు దిగారు. ఇక, అప్పట్లో కోడెల నియోజకవర్గంలో ఉండడం లేదని.. ఉంటే హైదరాబాద్ లేకపోతే.. విజయవాడ అంటూ.. ప్రచారం చేసిన అంబటి.. ఇప్పుడు అదే మార్గంలో ఉన్నారు.
దీంతో ఇప్పుడు సత్తెనపల్లిలో అభివృద్ది అనే మాట ఎక్కడిదక్కడే ఉందని.. అంబటి వల్ల రెండేళ్లలో జరిగింది ఏమీ లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అయితే.. ఈ విషయం తన దృష్టికి వచ్చిన తర్వాత.. ఇదంతా.. ప్రతిపక్షం టీడీపీ నేతలు చేస్తున్న కుట్ర అని అంబటి ప్రచారం చేస్తున్నారు తప్ప. వాస్తవాలను గమనించలేక పోతున్నారు. అంబటికి వచ్చే ఎన్నికల్లో కష్టమే అన్న మాట వినిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
సింపతీ ఎప్పుడూ పనిచేయదని కూడా స్పష్టం చేస్తున్నారు. మరి అంబటి మాటలు తగ్గించి.. చేతలకు దిగుతారో లేదో చూడాలి.
జగన్ వేవ్ ఒక్కసారే పనిచేస్తుంది. రెండోసారి గెలిపించేది అభివృద్ధే… కానీ ఆ విషయంలో అంబటి డిజాస్టర్ అంటున్నారు.