ఏపీలో ప్రజలు తిప్పలు పడుతున్నారు. కృష్ణానదికి కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తడంతో విజయ వాడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, నూజివీడు, ఏలూరు సహా పలు కీలక ప్రాంతాలు నీట మునిగాయి. అన్న మో రామచంద్రా అంటూ.. 200 గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ సాయం కూడా వారికి చేరువ కాని పరిస్థితి ఏర్పడింది. సుదూర ప్రాంతాలు.. నడుములోతు నీరు కారణంగా.. అధికారులు సైతం బాధిత ప్రజానీకానికి ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడింది.
ఇలాంటి సమయంలో టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ కార్యకర్తలను రంగంలోకి దింపి.. స్వయంగా వారి తోనే సాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ప్రజానేతగా పేరు తెచ్చుకున్న జగన్ ఏం చేస్తు న్నారు? తాడేపల్లిలోని తన ఇంటికి పక్కనే ఉన్న పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునిగాయి. ఇక, పొరుగున అనేక గ్రామాలు వరదలో విలవిల్లాడుతున్నాయి. మరి బాధ్యతాయుత నాయకుడిగా జగన్ ఏం చేయాలి? అన్నది ప్రశ్న. మాజీ ముఖ్యమంత్రిగా ఎలా స్పందించాలన్నది ప్రశ్న.
కానీ, ఆయన ఏమీ పట్టనట్టు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యారు. పోనీ.. తన పార్టీ కార్యకర్తలను కానీ.. గృహసారథులను కానీ.. రంగంలోకి దింపారా? సాయం కోసం.. తాడేపల్లిలో ఏమైనా పొయ్యిలు వెలిగించా రా? ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు.. నేనున్నానంటూ ముందుకు వచ్చారా? అంటే.. రాలేదు. పైగా.. తాడేపల్లిలో కూర్చుని.. సర్కారు చేస్తున్న సాయంలో తప్పులు వెతికే కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. వరద ముప్పు.. సర్కారు తప్పు అంటూ.. రైమింగ్తో కూడిన విమర్శలు చేస్తున్నారు.
కానీ, ఇప్పుడు విమర్శలు చేసే సమయం కాదు కదా! ప్రజలను తనకు తోచిన మేరకు.. ఆదుకునే ప్రయత్నం చేయాలి కదా! వాస్తవానికి.. తాడేపల్లి ప్యాలెస్లో 500 మంది కి ఆశ్రయం కల్పించేందుకు వీలుంది. పోనీ.. ఇలా అయినా చేయొచ్చుకదా! కానీ.. జగన్ మాత్రం.. ఇంత విపత్తులోనూ.. తప్పులు వెతికే పనిలో ఉన్నారు. మరి ఇలా చేయడం తగునా? అనేది ఆయనే ఆలోచన చేసుకోవాలి!!