అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులు మరణించారు. ఇందులో ఒక తమిళనాడుకు చెందిన వారు కాగా మిగిలిన ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు. హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూక్, లోకేష్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ చనిపోయిన వారిలో ఉన్నారు.
కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్ టోన్విల్లే ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారు. వాహనం ప్రయాణిస్తున్న నేపథ్యంలో అయిదు వాహనాలు ఒకదానికి ఒకటి అతి వేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. లోకేశ్ తన భార్యను కలిసేందుకు వెళ్తుండగా, దర్శిని యూనివర్శిటీకి వెళ్తున్నాడు.. ఆర్యన్ రఘునాథ్ డల్లాస్ లోని తన బంధువులను కలిసేందుకు వెళ్తున్నాడు.
వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదం జరిగిన తర్వాత అందులో మంటలు చెలరేగాయి. దీంతో ఎవ్వరు కూడా బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. వీరి శరీరాలు ఏ మాత్రం గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా కాలిపోయాయి. కార్ పూలింగ్ యాప్ లో నమోదయిన వివరాల ఆధారంగా మరణించిన వారి వివరాలు బయటకు వచ్చాయి.