మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నిహారిక.. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ వంటి పలు షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసింది. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా వెండితెరపై అడుగు పెట్టింది. భారీ సినీ నేపథ్యం ఉన్నప్పటికీ హీరోయిన్ గా సక్సెస్ అవడంలో నిహారిక ఫెయిల్ అయిందని చెప్పాలి.
ఇంతలో పెళ్లి విడాకులు అంటూ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక.. ఇప్పుడు మళ్లీ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఓవైపు నటిగా సినిమాలు చేస్తూనే ఇంకోవైపు నిర్మాతగా రాణిస్తోంది. నిహారిక ప్రొడ్యూస్ చేసిన తొలి చిత్రం కమిటీ కుర్రోళ్ళు ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న నిహారిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ ఇంటర్వ్యూలో తన తొలి సంపాదన మరియు ఇండస్ట్రీలోకి రాకముందు ఎక్కడ పని చేశాను అన్న ఆసక్తికర విషయాలను నిహారిక రివీల్ చేసింది. నిహారిక పుట్టింది, పెరిగింది, చదువుకుంది మొత్తం హైదరాబాద్ లోనే. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు పాకిట్ మనీ కోసం ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా హైదరాబాద్ లోని ఒక కేఫ్ లో నిహారిక పని చేసేదట. అక్కడ వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవారట. అదే తన తొలి సంపాదన అని తాజా ఇంటర్వ్యూలో నిహారిక తెలిపింది. ఇక ఆ తర్వాత ప్రముఖ డాన్స్ రియాలిటీ షో ఢీ యాంకర్ గా నిహారిక కెరీర్ మొదలు పెట్టింది. అప్పట్లో ఒక్కో ఎపిసోడ్ కు నిహారిక రూ. 20 వేలు రెమ్యునరేషన్ తీసుకునేది.