టాలీవుడ్ లో ఉన్న ఫేమస్ కమెడియన్స్ లో వైవా హర్ష ఒకడు. 2012లో `వైవా` అనే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ద్వారా హర్ష చెముడు పాపులర్ అయ్యాడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. 2013లో వెంకటేష్, రామ్ నటించిన మల్టీస్టారర్ మసాలా చిత్రంతో హర్ష వెండితెరపై అడుగుపెట్టాడు. ఆ తర్వాత మైనే ప్యార్ కియా, పవర్, గోవిందుడు అందరివాడేలే, రెడ్ అలెర్ట్, రామ్ లీలా, డైనమైట్ ఇలా వరుస చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు.
తనదైన కామెడీ టైమింగ్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. 2021లో హర్ష ఓ ఇంటివాడు కూడా అయ్యాడు. అక్షర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాదాపు నాలుగేళ్లు ప్రేమించి ఈ జంట.. పెద్దల అంగీకారంతో వైభవంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే రీసెంట్ గా హర్ష సోషల్ మీడియాలో `జీవితం అనేది రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది.. అప్స్ అండ్ డౌన్స్, లోస్ అండ్ హైస్, ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, భయం, థ్రిల్ ఇలా అన్నీ ఉంటాయి.. ఏదీ మన కంట్రోల్లో ఉండదు..
మనల్ని ఆపేందుకు మధ్యలో ఎన్నో వస్తాయి. ఓ టైమ్ తర్వాత వెళ్లిపోతాయి. కాబట్టి మనం బకిల్‌ను పెట్టుకుని ఆ రైడ్‌ను ఎంజాయ్ చేస్తుండాలి. అసలేది ఆశించకూడదు.. తర్వాత నిరాశ పడకూడదు. జీవితం ఎటు వెళ్తే అటు వెళ్లడమే` అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ తో గందరగోళం నెలకొంది. హర్షకు ఏమైందని జనాలు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి హర్ష విడాకుల బాట పడుతున్నాడని జోరుగా ప్రచారం చేస్తున్నారు.
దాంతో విడాకుల వార్తలపై తాజాగా హర్ష క్లారిటీ ఇచ్చాడు. తన పర్సనల్ లైఫ్ సాఫీగానే సాగుతుందని.. కానీ పనిలో కొన్ని తెలివి తక్కువ మెదడు లేని రాజకీయాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు హర్ష సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అయినా ఇవన్నీ ప్రతి చోట ఉండేవే అని.. తాను హ్యాపీ గానే ఉన్నానని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరింత స్ట్రాంగ్ గా వస్తానని హర్ష తెలిపాడు. ఎదురుదెబ్బలు కంటే పునరాగమనాలు ఎల్లప్పుడూ గొప్పవని పేర్కొన్నారు. మొత్తానికి విడాకుల రూమర్స్ కి హర్ష చెక్ పెట్టడంతో ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
View this post on Instagram